ప్రేమన్నాడు.. పెళ్ళన్నాడు.. కానీ చివరికి నిజస్వరూపం బయట పెట్టాడు..?

praveen

మంచి వారి ముసుగులో  నేడు దారుణాలకు పాల్పడుతున్న వారు  రోజురోజుకు ఎక్కువవుతున్నారూ.  సమయం వస్తే చాలు తమలోని మరో స్వరూపం  బయటకు తీస్తూ నిజస్వరూపాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ ఓ వ్యక్తి అదే చేసాడు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామని  యువతీ  యువకుడు ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడ్డారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. అయితే వివాహం చేసుకుంటే మీ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది అంటూ కుల పెద్దలు హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఆ యువతికి నచ్చజెప్పి వేరే వ్యక్తితో నిశ్చితార్థం చేసారు. ఇక నిశ్చితార్థం అయ్యేంతవరకు సైలెంట్గా ఉన్న యువకుడు నిశ్చితార్థం పూర్తవ్వగానే... శారీరక సుఖం కావాలంటే బ్లాక్ మెయిల్ కు దిగాడు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన యువతి విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

 

 

 వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని మైసూరు సమీపంలోని నంజనగూడు తాలూకా మెల్లహాళ్లు  లో  మణికంఠ అనే యువతీ యువకులు నివాసముంటున్నారు. గత రెండు సంవత్సరాల క్రితం వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇక గాఢంగా ప్రేమలో మునిగితేలిన ఇద్దరు... పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. ఈ  ఇద్దరి కులాలు వేరు కావడంతో ఎలాగైనా పెద్దలను ఒప్పించాలని వీర ప్రేమ వ్యవహారాన్ని పెద్దల వద్ద తెలియజేశారు. ఈ నేపథ్యంలో ప్రియురాలు మేఘన  ఎక్కువ కులానికి చెందినది కావడంతో... మణికంఠ ను  పెళ్లి చేసుకుంటే పిల్లల జీవితం ప్రశ్నార్థకంగా మారిపోతోంది అంటూ కుల పెద్దలు తనకు నచ్చచెప్పారు. మొత్తంగా అమె  మనసు మార్చేశారు. 

 

 

 ఈ క్రమంలోనే మేఘనకు  అదే కులానికి చెందిన ఓ వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం  జరిగేంత వరకు బాగానే ఉన్నా మణికంఠ ఆ తర్వాత తనకు శారీరక సుఖం ఇవ్వాలి అంటూ  అసలు రూపం బయటపెట్టాడు. శారీరక సుఖం ఇవ్వకపోతే ఏకాంతంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే మేఘన మాత్రం శారీరక సుఖం ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో మేఘన  ఎంత బ్లాక్మెయిల్ చేసినప్పటికీ లొంగక పోవడంతో కాబోయే భర్తకు.. వారిద్దరూ కలిసి ఏకాంతంగా తీసుకున్న ఫోటోలు పంపించారు. ఈ ఫోటోలను చూసిన కాబోయే భర్త పెళ్లి  రద్దు చేసుకున్నాడు. ప్రియుడు మనికంట చేసిన పనికి తీవ్ర మనస్థాపం చెందిన మేఘన విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. తమ కుమార్తె ఆత్మహత్య కు ప్రియుడు మణికంఠ కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు.కాగా  పరారీలో ఉన్న మణికంఠ గురుంచి  గాలిస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: