ఢిల్లీ ఎన్నికల ఫలితాలు మరోసారి ఆప్ కే పట్టం కట్టాయి. అంతా ఆప్ గెలుస్తుందని ముందే ఊహించారు కానీ.. ఇంత భారీ స్థాయిలో మరోసారి ఢిల్లీ పీఠం దక్కించుకుంటుందని ఎవరూ అనుకోలేదు. మొత్తం 70 అసెంబ్లీ సీట్లలో 62 సీట్లు దక్కించుకుంది. అయితే ఈ ఢిల్లీ ఓటరు తీర్పు ఏం చెబుతోంది. వీటిని ఎలా అర్థం చేసుకోవాలి.. మోడీ, షా మ్యాజిక్కు, మాటల గారడీకి కాలం చెల్లిందా.. ఇప్పుడు ఈ అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి.
ఎందుకంటే.. బీజేపీకి ఎదురు దెబ్బ తగలడం.. ఇదేమీ కొత్త కాదు.. మొన్న హర్యానా, మహారాష్ట్ర, రాజస్థాన్, ఛత్తీస్ఘడ్, జార్ఖండ్.. ఇప్పుడు ఢిల్లీ ఇలా ఇటీవల చాలా ఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. ఇందుకు కారణాలు ఏంటి..? ఓటరు తీరు మారుతోంది. అందుకు ఢిల్లీ ఎన్నికలు మరో నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో బీజేపీ ప్రజలను రెచ్చగొట్టడమే ఎన్నికల విధానంగా పెట్టుకుంది. ఎందుకంటే మోడీ పాలనలో చెప్పుకోదగ్గ ప్రగతి కనిపించడం లేదు.
గతంలో మన్మోసింగ్ పదేళ్ల పాలనలోనే దేశ జీడీపీ, ఆర్థిక వృద్ధి పరుగులు పెట్టాయి. ప్రగతి రేటు దాదాపు 10 శాతం దాటింది. కానీ ఇప్పుడు 5-6 శాతం ఆర్థిక వృద్ధి రావడం గగనంగా మారింది. అందుకే మోడీ సర్కారు దేశభక్తిని రెచ్చగొట్టే... అంశాలపై దృష్టి సారిస్తోంది. భావోద్వేగాల అంశాలపై ఆధారపడుతోంది. మొన్నటి ఢిల్లీ ఎన్నికల ప్రచారంలోనూ బీజేపీ ఇదే చేసింది.
అయితే.. ఈ ధోరణిని జనం కూడా అంగీకరించడం లేదు. రెచ్చగొట్టే మాటలు, రెచ్చగోట్టే విధానాన్ని ప్రజలు ఇష్టపడడం లేదు. ఇప్పుడు ఆ విషయం మరోసారి ఢిల్లీ ఎన్నికలు రుజువు చేశాయి. బీజేపీ మాటల గారడీ ప్రజలు నమ్మలేదు. అయితే ఇక్కడ మరో విషయం గమనించాలి. ఇవి అసెంబ్లీ ఎన్నికలు.. జనం రాష్ట్ర అంశాలనే చూస్తారు. అందుకే మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో ఢిల్లీలో ఏడు ఎంపీ సీట్లూ బీజేపీకే దక్కాయి. ఏదేమైనా భారతీయ ఓటరు మార్పును తాజా ఎన్నికలు మరోసారి ప్రతిబింబించాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: