కుల్దీప్ యాదవ్ అద్భుత చెత్త రికార్డు..?

praveen

ప్రస్తుతం టీమిండియా వరుస సిరీస్ లను  గెలుచుకుంటూ అద్భుత ప్రదర్శన చేస్తున్న విషయం తెలిసిందే. ప్రత్యర్థి జట్టు ఎవరైనా చిత్తుగా ఓడిస్తు... విజయపరంపర కొనసాగిస్తోంది  టీమిండియా జట్టు. ప్రస్తుతం టీమిండియా చరిత్రలోనే ఆటగాళ్లు  అందరూ ఎంతో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఉన్నారూ . ఇక మొన్నటికి మొన్న న్యూజిలాండ్ టీమిండియా మధ్య జరిగిన ఐదో  టి20 సిరీస్లో టీమిండియా వరుసగా ఐదు మ్యాచ్ల్లో గెలిచి  అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు వరుసగా ఐదు మ్యాచ్ల్లో ఓడించే క్లీన్స్వీప్ చేసి అద్భుత విజయాన్ని సాధించింది టీమిండియా. ప్రతి మ్యాచ్ లోనూ అటు ఆటగాళ్లు కూడా అద్భుత ప్రదర్శన చేస్తూ సంచలన రికార్డులను నెలకొల్పుతున్నారూ. 

 

 

 ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాలో ప్రతి ఒక ఆటగాడు జట్టు విజయంలో కీలకంగా మారిపోయారు. టీమ్ ఇండియా లోని ఆటగాళ్లందరూ సంచలన రికార్డులను బద్దలు కొడుతున్నారు. వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న టీమిండియాలో చాలామంది ఆటగాళ్ళు  రికార్డులను బ్రేక్ చేస్తూ... సరికొత్త రికార్డులు సృష్టిస్తోంటే...  కొంత మంది ఆటగాళ్లు మాత్రం చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంటున్నారు. తాజాగా  కివీస్ తో  జరిగిన తొలి వన్డేలో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెత్త ప్రదర్శన చేశాడు.  ఈ మ్యాచ్ లో 10 ఓవర్లు వేసిన కుల్దీప్ యాదవ్ ఏకంగా న్యూజిలాండ్ బ్యాట్ మెన్స్ కి  84 పరుగులు కట్టబెట్టాడు. దీంతో వన్డేల్లో అత్యధిక పరుగులు ఇచ్చిన భారత బౌలర్లలో కులదీప్ యాదవ్ మూడో స్థానంలో నిలిచాడు. కాగా ఈ జాబితాలో యజ్వేంద్ర చాహల్  2019 సంవత్సరంలో ఇంగ్లాండ్ తో  జరిగిన వన్డే మ్యాచ్లో 88 పరుగులు ఇచ్చి మొదటి  స్థానంలో ఉండగా... 2008 సంవత్సరంలో పాకిస్తాన్పై 85 పరుగులు ఇచ్చి రెండవ స్థానంలో నిలిచాడు పీయూష్ చావ్లా. 

 

 

 కాగా  నేడు హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్ టీమిండియా మధ్య మొదటి వన్డేలో టీమిండియాకు భారీ షాక్ తగిలిన విషయం తెలిసిందే. అంతకుముందు జరిగిన టి20 మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియాకు.. ఈరోజు జరిగిన మొదటి వన్డే లోనే భారీ షాక్ తగిలింది. మూడు వికెట్ల తేడాతో కివీస్ జట్టు విజయం సాధించింది. దీంతో కివీస్ ఆటగాళ్ల లో కొత్త ఆశలు చిగురించినట్టయ్యింది . కాగా మరో మ్యాచ్ గెలవాలని కివీస్ జట్టు పట్టుదలతో ఇంకో మ్యాచ్  కోసం సిద్ధమౌతోంటే...  ఈ సారి ఎలాగైనా గెలవాలని టీమిండియా కూడా పట్టుదలతో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: