ఓవైపు ప్రాణాంతక వైరస్ జనం ప్రాణాలు తీసేస్తోంది. రోజూ పదుల సంఖ్యలో జనం చనిపోతున్నారు. మరో వైపు రోజూ కొత్తగా వందల మందికి ఈ వైరస్ సోకుతోంది. ఇదే ఇండియా అయితే బెంబేలు పడిపోయేదే.. నిర్ణయాలు తీసుకోవడంలోనే సగం జాప్యం జరిగేదే.. కానీ అక్కడ ఉన్న ది చైనా.. ఇలాంటి విపత్కర సమయంలో చైనా చూపిస్తున్న ధైర్యం శభాష్ అనిపిస్తోంది. రోగుల కోసం ఏకంగా వెయ్యి పడకల ఆసుపత్రిని చైనా కేవలం 10 రోజుల్లో నిర్మించిన తీరు ప్రపంచాన్నే అబ్బుర పరుస్తోంది.
ఈ ఆసుపత్రి నిర్మాణం కోసం చైనా ఒక రకంగా యుద్ధమే చేసింది. ఆసుపత్రి నిర్మించాలన్న నిర్ణయానికి వచ్చిన వెంటనే ప్లాన్ రెడీ అయ్యింది. వైరస్ వేగంతో పోటీపడుతూ.. 10 రోజుల్లోనే కట్టాలని డిసైడ్ అయ్యారు. ఇంజినీర్లు, నిపుణులు, నాయకులు.. అంతా పగలనక, రాత్రనకా 24 గంటలూ కష్టపడ్డారు. దేశం నలుమూలల నుంచి ఇంజినీర్లను రప్పించారు. కార్పెంటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్మికులు.. అందర్నీ యుద్ధ ప్రాతిపదికన రప్పించారు.
అంతే కాదు.. ఆసుపత్రి కట్టబోతున్న వుహాన్ ప్రాంతాన్ని తమ నియంత్రణలోకి తీసుకుంది సైన్యం. చుట్టుపక్కల ప్రాంతాలకు రోడ్డు, రైలు, విమాన రాకపోకలపై నియంత్రణ విధించారు. కోటీ మంది నగరవాసులను ఇళ్లకే పరిమితం చేశారు. కేవలం ఆసుపత్రి నిర్మాణానికి ఉపయోగించే వాహనాలే అనుమతించారు. వందల ట్రక్కులను, క్రేన్లను, సిమెంటు మిక్సర్లను, నిర్మాణసామగ్రిని తరలించే వాహనాలను ఉపయోగించారు.
ఇలా ఆసుపత్రి కట్టిన తీరు చూసి ఇండియన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇదే మన ఇండియాలో ఓ ఆసుపత్రి కట్టాలంటే ఎంత సమయం పడుతుందో అని లెక్కలు వేసుకుంటున్నారు. ప్లానింగ్ , నిధుల విడుదల కే నాలుగైదు నెలల సమయం పడుతుంది. ఎంత యుద్ధప్రాతిపదికన చేసినా.. కనీసం ఐదారు నెలల్లో కానీ పూర్తి కాదు. అందుకే అంతా ఇప్పుడు శభాష్ చైనా అంటున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: