ఘోరం : కోడి కూర కోసం.. కన్న కొడుకే ఎంత దారుణానికి ఒడిగట్టాడో..?

praveen

ఈమధ్య రోజురోజుకు హత్యలు పెరిగిపోతున్నాయి . క్షణికావేశంలో ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదు. అసలు మనిషి ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. దీంతో రోజురోజుకి సమాజం తీరు ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కన్న కొడుకు తండ్రిని హతమార్చడం... లేదా తండ్రి కన్న కొడుకు ని అతి దారుణంగా చంపేయడం లాంటి ఘటనలు ఈ రోజుల్లో తరచు తెరమీదికి వస్తూనే ఉన్నాయి. క్షణికావేశంలో హత్యలు చేసి ఆ తర్వాత బాధ పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. తండ్రీ కొడుకుల మధ్య జరిగిన చిన్న గొడవ తండ్రి ప్రాణాన్ని బలిగొంది. తెలంగాణలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. 

 

 వివరాల్లోకి వెళితే... చిన్న విషయంలో తండ్రీ కొడుకుల మధ్య చోటుచేసుకున్న వివాదం కొడుకు తండ్రి ప్రాణాలు తీసేంతవరకు వెళ్ళింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తకోట లో చోటుచేసుకుంది. భీమదేవరపల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన సయ్యద్ మదార్... బండరాయి కొడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ పని కోసమే శంకరపట్నం మండలం కొత్తగట్టు లో నివాసం కూడా ఏర్పర్చుకున్నాడు. గత రెండు నెలల నుంచి కొత్తగుట్ట లో ఏర్పరచుకున్న నివాసంలోనే ఉంటూ బండరాయి కొడుతూ బతుకు బండిని నెట్టుకొస్తున్నాడు. 

 

 

 ఈ నేపథ్యంలోనే మంగళవారం మద్యం సేవించి ఆ వ్యక్తి ఇంటికి వచ్చాడు. ఇక తనతోపాటు ఉన్న కొడుకు ఖాసీం తో కోడి కూర వండి పెట్టాలి అంటూ గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే ఇద్దరు మధ్య  వివాదం కాస్త ముదిరింది. అయితే ప్రతిరోజు ఫుల్లుగా తాగొచ్చి  వేధింపులకు గురిచేస్తున్న తండ్రిని హతమార్చాలని కొడుకు ఖాసీం  నిర్ణయించుకున్నాడు. అనుకున్న ప్రకారమే నిద్రపోతున్న తండ్రి తలపై బండరాయితో మోతి హతమార్చాడు కొడుకు ఖాసీం . ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొడుకు ఖాసీం ను  అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: