హెరాల్డ్ బర్త్ డే : నేడు జన్మించిన ప్రముఖులు వీరే..?

frame హెరాల్డ్ బర్త్ డే : నేడు జన్మించిన ప్రముఖులు వీరే..?

praveen

జనవరి 29వ తేదీన చరిత్ర లోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జన్మించారు మరి నేడు జన్మించిన ఆ ప్రముఖులు ఎవరు తెలుసుకుందాం రండి.

 

 మొసలికంటి తిరుమలరావు జననం : ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు పార్లమెంటు సభ్యులైన మొసలికంటి తిరుమలరావు 1901 జనవరి 29వ తేదీన జన్మించారు.1921 సంవత్సరంలో మహాత్మా గాంధీ పిలుపుమేరకు చదువును సైతం వదిలి సహాయ నిరాకరణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు మొసలికంటి తిరుమలరావు. ఆ తర్వాత 1930లో జరిగిన సత్యాగ్రహం ఉద్యమంలో పాల్గొని ఏకంగా ఏడాది పాటు కఠిన శిక్ష అనుభవించారు.క్విట్  ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొన్నారు ముసలి కంటి తిరుమలరావు. ఇక తర్వాత రెండు పర్యాయాలు కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. పార్లమెంట్ సభ్యుడు గాని అసెంబ్లీ సభ్యుడు గాను ఈయన వ్యవహరించాడు. 1975 సంవత్సరంలో ఈయన  మరణించారు. 

 

 గౌరీ లంకేష్ జననం : ప్రముఖ జర్నలిస్టు ఉద్యమకారిణి గౌరీ లంకేష్ 1962 జనవరి 29వ తేదీన జన్మించారు. చిన్నప్పటినుంచి జర్నలిజంపై ఎంతో ఆసక్తి కనబరిచిన గౌరీ లంకేశ్ ధైర్యశాలి గా ముక్కుసూటిగా మాట్లాడే పాత్రికేయురాలిగా కూడా ఎంతో ప్రసిద్ధి చెందారు. మూఢ నమ్మకాలకు  వ్యతిరేకంగా ఎంతగానో పోరాటం చేశారు ఈమె. కాగా గౌరీ లంకేశ్ కొన్ని వివాదాల కారణంగా హత్యలు గురయ్యారు.

 

 వేటూరి సుందరరామ్మూర్తి జననం : తెలుగు ప్రేక్షకులందరూ వేటూరి గా పిలవబడే వేటూరి సుందరరామ్మూర్తి 1936 జనవరి 29వ తేదీన జన్మించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతగానో ప్రసిద్ధి చెందిన  సినీ గీత రచయిత, తొలినాళ్ళలో పాత్రికేయునిగా పనిచేసిన వేటూరి... ఆ తర్వాత సినిమాల్లోకి రచయితగా రంగ ప్రవేశం చేసి తనదైన ముద్ర వేసుకున్నారు. ఎన్నో రచనలు కూడా రచించారు. వేటూరి సుందరరామ్మూర్తి 8 నంది అవార్డులతో పాటు ఒక జాతీయ పురస్కారం కూడా అందుకున్నారు.  మొత్తంగా ఈయనా 14 అవార్డులను సొంతం చేసుకున్నారు. శ్రీశ్రీ లాంటి వారి తర్వాత జాతీయ ఖ్యాతిని ఆర్జించిన వ్యక్తి వేటూరి సుందరరామమూర్తి. ఎన్నో  సినిమాలు అద్భుతమైన పాటలను అందించిన గొప్ప రచయిత వేటూరి సుందరరామ్మూర్తి. ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను వేటూరి సుందరరామ్మూర్తి తెలుగు చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తు చేసుకుంటూనే  ఉంటారు.

 

 పంగులూరి రామన్ సుబ్బారావు జననం : ప్రఖ్యాత ఆంగ్ల దేశపు క్రికెటర్ పంగులూరి రామన్ సుబ్బారావు 1932 జనవరి 29వ తేదీన జన్మించారు. ఆ తర్వాత ఇంగ్లాండ్ వెళ్లి ఇంగ్లాండ్ లో స్థిరపడిన తర్వాత 1987 నుంచి 1990 వరకు టెస్ట్ మరియు కౌంటీ క్రికెట్ బోర్డుకు అధ్యక్షునిగా కూడా కొనసాగారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: