కరోనా వైరస్ కలకలం.. 'హైదరాబాద్'కు ప్రత్యేక వైద్య బృందం!
కరోనా వైరస్.. కలకలం సృష్టిస్తుంది.. ప్రజలను వణికించేస్తోంది. ఇప్పటికే ఎంతోమంది ఈ వైరస్ కారణంగా చైనాలో మృతిచెందారు.. ఈ వైరస్ కారణంగా అందరూ వణికిపోతున్నారు.. అయితే అలాంటి ఈ వైరస్ ను ఓ మెడికల్ స్టూడెంట్ చైనా నుండి ఇండియాకు మోసుకొచ్చాడు. అది కూడా ఎక్కడో కాదు మన హైదరాబాద్ కె వచ్చింది ఆ వైరస్.
దీంతో ఆ వ్యక్తికి వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు. ఇంకా వాళ్ళ ఇంట్లో వారికీ కూడా డాక్టర్లు ఇప్పటికే వైద్యం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో మరో నలుగురిలో ఈ వైరస్ ఉన్నవారు బయట పడ్డారు. దీంతో డాక్టర్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కు ప్రత్యేక వైద్య బృందం వచ్చింది.
ప్రత్యేక వార్డులలో ఏలాంటి కేర్ తీసుకోవాలి అనేది వారు సూచిస్తున్నారు. అంతేకాదు.. ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా చెప్తున్నారు. అయితే కరోనా వైరస్ రాకూడదు అంటే కొన్ని జాగ్రత్తలు తప్పకుండ తీసుకోవాలి. దగ్గు, జలుబు ఉన్నవారికి ఎంత దూరం ఉంటె అంతమంచిది. ప్రస్తుతం కాలం బాలేదు కాబట్టి దూరంగా ఉండటం మంచిది.
అంతేకాదు.. బయట చేసిన ఆహారం కూడా తీసుకుంద ఉండటం మంచిది. అంతేకాదు నాన్ వెజ్ కొద్ది రోజులు పూర్తిగా మానేయండి. అప్పుడే ఎంతోమంచిది. కాగా ఈ కరోనా వైరస్ గాలి ద్వారా వస్తుంది కనుక తగిన జాగ్రత్తలు తీసుకోండి. బయటకు వచ్చిన సమయంలో మాస్కు వేసుకోవడం ఎంతో అవసరం. కాగా ఈ వ్యాధి లక్షణాలు మొదట దగ్గు, జలుబు, మోకాళ్ళ నొప్పులు, తలనొప్పి లక్షణాలతో ఈ వైరస్ వస్తుంది. అవి మామూలుగానే కనిపించిన ఇప్పుడు సీజన్ బాలేదు కాబట్టి డాక్టర్ ను సంప్రదించడం ఎంతో ముఖ్యం.