జాతీయ రికార్డు సాధించిన టీఆర్ఎస్ ? దేశంలోనే టాప్

మాకు మేమే సాటి... మాకు ఎవరు లేరు పోటీ ! అనే విధంగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో కారు పార్టీ తమ రాజకీయ ప్రత్యర్థులను కంగారు పెట్టించింది. తమ ప్రత్యర్థులు కని విని, ఊహించని రీతిలో మున్సిపాలిటీలను దక్కించుకుని మెరుగైన  ఫలితాలను సాధించింది. తెలంగాణ మొత్తం మీద 120 మున్సిపాలిటీలు ఉంటే వాటిలో 109 మున్సిపాలిటీలను టీఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకుంది. అలాగే 10 కార్పొరేషన్ ఉంటే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను పక్కనపెడితే మిగతా తొమ్మిది కార్పొరేషన్ లలోనూ ఏడు కార్పొరేషన్లను టిఆర్ఎస్ తమ ఖాతాలో వేసుకుంది. ఇది ఒక రకంగా జాతీయ రికార్డు అనే చెప్పాలి.

 

 మున్సిపల్ ఎన్నికల్లో దేశంలోనే ఇప్పటివరకు ఏ పార్టీ సాధించనన్ని స్థానాలను దక్కించుకుని ఈ రికార్డులను టిఆర్ఎస్ పార్టీ సాధించగలిగింది. 120 మున్సిపాలిటీల్లో 109 మున్సిపాలిటీలు అంటే 91 శాతం మున్సిపాలిటీలను టిఆర్ఎస్ పార్టీ దక్కించుకోవడం అంటే ఆషామాషీ కాదు. ఇప్పటివరకు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఏ పార్టీ ఇప్పటి వరకు ఈ రికార్డును సాధించలేదు. వాస్తవంగా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం పై  సానుకూల దృక్పథం ప్రజలకు ఉంటుంది. కానీ 91% రావడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. 


అందుకే టిఆర్ఎస్ పార్టీ దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ చోటు చేసుకునే విధంగా కొత్త రికార్డును సృష్టించిన గలిగింది. ఈ రికార్డు టిఆర్ఎస్ శ్రేణులు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్, బిజెపి పార్టీలు బలహీన పడిన క్రమంలో టిఆర్ఎస్ ఈ విధంగా రోజురోజుకు పుంజుకోవడం చూస్తుంటే ఆ పార్టీకి భవిష్యత్తులోనూ తిరుగు లేదు అనే విషయం అర్థం అవుతోంది. దీని వెనుక టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృషి ఎక్కువగా కనిపిస్తోంది. ఆయన ఆధ్వర్యంలో పగడ్బందీగా రాజకీయ వ్యూహాలు అమలుచేయడం, ప్రత్యర్థుల బలా, బలాలను ముందుగానే పసిగట్టడం కారణంగా ఈ స్థాయిలో విజయాన్ని టీఆర్ఎస్ పార్టీ నమోదు చేసుకోగలిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: