అమ్మ ఒడి సొమ్ము పెట్టిన చిచ్చు... అమ్మ ప్రాణం తీసింది..?
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఎన్నో వినూత్న పథకాలు ప్రవేశ పెడుతూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ ప్రజలందరికీ సుపరిపాలన అందిస్తున్నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రిగా ముందుకు సాగుతున్నారు. పేద ప్రజల అభ్యున్నతి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రాజన్న పాలన మరోసారి వస్తుంది అని నమ్మిన ప్రజలకు అంతకుమించిన పాలన అందిస్తారు సీఎం జగన్.
నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనలో... నిరుపేదలకు చేయూతను అందించడంలో... రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో... ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో.. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం నుంచి చేయూతను అందించడం లో... ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముందుంటున్నారు. పొరుగు రాష్ట్రాల నేతలు ప్రజలు సైతం జగన్ మోహన్ రెడ్డి పాలనను ప్రశంసించేంత గా... పాలనలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే పేద కుటుంబాల్లోని విద్యార్థులందరూ బడికి వెళ్లి చదువుకోవాలి అనే ఉద్దేశంతో... మీరు మీ పిల్లలను బడికి పంపండి వారికి మేనమామనై అన్ని చూసుకుంటా అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకానికి ఊపిరి పోసిన విషయం తెలిసిందే.
ఈ పథకం ద్వారా విద్యార్థి తల్లి లేదా రక్షకుడు ఖాతాలో ప్రతి ఏటా 15 వేల రూపాయలు జమ చేసేందుకు నిర్ణయించింది జగన్మోహన్రెడ్డి సర్కార్. ఇటీవల ఈ మహత్తర పథకాన్ని ప్రారంభించింది జగన్ సర్కారు. ఇక జగన్ సర్కార్ తాజాగా ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం ద్వారా వచ్చిన నగదు ఓ కుటుంబంలో చిచ్చు పెట్టింది. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం నేతిగుండ్లపల్లి గ్రామానికి చెందిన... ఆదిలక్ష్మి మహేశ్వర్ దంపతులకు అమ్మఒడి పథకం కింద పదివేల రూపాయలు వచ్చాయి. అందులోంచి ₹4000 ఆదిలక్ష్మి అప్పు చెల్లించడంతో మహేశ్వర్ ఆమె తో వాగ్వాదానికి దిగాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆదిలక్ష్మి మంగళవారం పురుగుమందు తాగి చికిత్స పొందుతూ మరణించింది.