అతను మగాడే కాదు... కానీ 50 మంది అమ్మాయిలపై అత్యాచారం..?

praveen

అమ్మాయిలపై రోజురోజుకూ లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్న విషయం తెలిసిందే. అమ్మాయిలు ఎక్కడికి వెళ్లిన వారిపై లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ఒక్క మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి లైంగిక వేధింపులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. అయితే ఇప్పటి వరకూ అబ్బాయిలు అమ్మాయిల పై లైంగిక వేధింపులకు పాల్పడడం చూసాం కానీ ఇక్కడ ఒక అమ్మాయి కూడా అబ్బాయి విషయంలో లైంగిక వేధింపులకు పాల్పడింది . ఒకరు ఇద్దరు కాదండోయ్ 50 మంది బాలికలపై అత్యాచారానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే... అమ్మాయి అబ్బాయిల వేషం మార్చి ఎంతో మంది బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన లండన్ లో చోటుచేసుకుంది.

 

 

 50 మంది బాలికలపై అత్యాచారానికి పాల్పడిన సదరు అమ్మాయికి కోర్టు శిక్ష విధించింది. గెమ్మ వాట్స్  అనే 21 ఏళ్ల యువతి తల్లితో కలిసి ఉత్తర లండన్ లో నివసిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో అబ్బాయి పేరిట పలు అకౌంట్లను ఓపెన్ చేసింది యువతి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే గెమ్మ ... తను పదహారేళ్ల అబ్బాయి అని చెబుతూ 14,15 ఏళ్ల బాలికలతో చాటింగ్ చేయడం మొదలు పెట్టింది. ఇక ఆ తర్వాత అబ్బాయిల వేషం మార్చి ఫోటోలు పంపుతూ...అమ్మాయిలతో  మాటలు కలిపి నేరుగా కలవాలంటూ అమ్మాయిలపై ఒత్తిడి తెచ్చింది. ఇక చూడటానికి రూపం కూడా బాగుండడంతో ఎక్కువగా ఆమె రూపానికి అమ్మాయిలు ఆకర్షితులయ్యారు. దీంతో రెండు మూడు సార్లు కలిసిన తర్వాత లైంగిక దాడికి పాల్పడేది ఈ యువతీ . ఇలా ఏకంగా 50 మంది బాలికలపై అబ్బాయి విషయంలో లైంగిక దాడికి పాల్పడింది యువత. 

 

 

 50 మంది బాలికలతో పాటు ఒక అబ్బాయి పై కూడా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలోనే 2018 సంవత్సరంలో గెమ్మ వాట్స్ ను  పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా  పట్టుకుని అరెస్టు చేశారు. కాగా ఈ కేసులో విచారణ అధికారి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.గెమ్మ వాట్స్  అనే యువతి గతంలో ఫుట్ బాల్ ఆటలో  అద్భుతంగా రాణించినది అని తెలిపారు. కాగా  ఎంత మంది పై అత్యాచారాలు చేస్తూ దారుణానికి ఒడిగట్టినందుకు కనీసం పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదని తెలిపారు. అబ్బాయిల వేషం మార్చి తన క్రూర వాంఛను తీర్చుకున్నది అని విచారణ అధికారి చెప్పుకొచ్చారు. కాగా  ఈ కేసు కోర్టులో వాయిదా పడుతూ వచ్చి శనివారం ఈ కేసులోని నిందితురాలికి  శిక్ష పడింది. కాగా  ఒక అమ్మాయి అయి ఉండి అమ్మాయిపై లైంగిక దాడి చేయడంతో అటు పోలీసులు కూడా అవాక్కయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: