హెరాల్డ్ బర్త్ డే : జనవరి 9 న జన్మించిన ప్రముఖులు వీరే..?

praveen

హరగోవింద్ ఖొరానా జననం : ప్రముఖ జీవశాస్త్ర శాస్త్రజ్ఞుడు హర్ గోవింద్ ఖురానా. భారత సంతతికి చెందిన హర్ గోవింద్ ఖురానా నోబెల్ బహుమతిని పొందారు. జీవ శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేసి ఎన్నో విషయాలను మానవాళికి అందించారు హరగోవింద్ ఖొరానా. ఈయన  1922 జనవరి 9వ తేదీన అవిభక్త భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాయపూర్ అనే గ్రామంలో జన్మించారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో మాంసకృత్తులు న్యూక్లిక్ ఆమ్లాల కు సంబంధించి పరిశోధనలు మొదలుపెట్టారు హర్ గోవింద్ ఖురానా. ఎన్నో పరిశోధనల అనంతరం కృత్రిమ జిన్ ను  హర్ గోవింద్ ఖురానా కనుగొన్నారు. దీనికిగాను నోబెల్ పురస్కారం ఆయనను వరించింది. అంతేకాకుండా పద్మవిభూషణ్ పురస్కారం కూడా అందుకున్నారు హర్ గోవింద్ ఖురానా. డిఎన్ఏ ముక్కలను అతికించు డిఎన్ఎ లిగస్ ఎంజైమ్  ను కనుగొన్నాడు ఈయన.

 

 జిమ్మీ ఆడమ్స్ జననం : జిమ్మీ ఆడమ్స్ వెస్ట్ఇండీస్ కు చెందిన మాజీ క్రీడాకారుడు. ఎన్నో సంవత్సరాల పాటు వెస్టిండీస్ జట్టుకు సారథ్యం వహించే జట్టుకు విజయాలు అందించారు. జిమ్మీ ఆడమ్స్ 1968 జనవరి 9వ తేదీన జన్మించారు. ఎడమ చేతితో బ్యాటింగ్ మరియు ఎడమ చేతితో బౌలింగ్ చేయగల ఆడమ్స్ మంచి అల్ రౌండర్  కూడా. వెస్టిండీస్ జట్టులో కీలక ఆల్ రౌండర్ గా వ్యవహరించడమే కాకుండా  చాలా సంవత్సరాల వరకు జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టి ఎన్నో  విజయాలను అందించారు  . అంతేకాదు జిమ్మీ ఆడమ్స్ అవసరమైనప్పుడు వికెట్ కీపర్ గా   కూడా చేసేవాడు . మొదటి టెస్ట్ మ్యాచ్లో ఆడిన ఆడమ్స్ టెస్ట్ మ్యాచ్ లో ఆరంగేట్రం చేసిన వెంటనే తన ప్రతిభను చూపించటం  ప్రారంభించారు. ఇలా తనకంటూ ఒక ప్రత్యేకమైన రికార్డులు సృష్టించాడు జిమ్మీ ఆడమ్స్. బ్రియాన్ లారా నుంచి వెస్టిండీస్ జట్టుకు నాయకత్వం బాధ్యతలు స్వీకరించాడు. 1999 సంవత్సరంలో ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో వెస్టిండీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు జిమ్మీ ఆడమ్స్.

 

 మిట్టపల్లి సురేందర్ : వరంగల్ జిల్లాకు చెందిన మిట్టపల్లి సురేందర్ 1985 జనవరి 9వ తేదీన జన్మించారు. ఈయన తెలుగు జానపద కళాకారుడు. తెలంగాణ ఉద్యమం కోసం ఎన్నో పాటలను అందించారు  సురేందర్. ఎన్నో సినిమాలకు సినీగీతాలు కూడా అందించారు మిట్టపల్లి సురేందర్. 2011 సంవత్సరంలో ఈయన  పాటకు గాను నంది అవార్డును సైతం అందుకున్నారు. దాదాపు 300కు పైగా ప్రైవేట్ సాంగ్స్ రాశారు మిట్టపల్లి సురేందర్.

 

 దేవేంద్ర హార్నే  : 1995 జనవరి 9వ తేదీన జన్మించారు. 12 చేతివేళ్లతో 13 కాళీ వేళ్ళతో  ఇండియా లో జన్మించారు దేవేంద్ర.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: