హోటల్ బిల్ 5,500.. టిప్ 1.45 లక్షలు..!
ఈ మధ్యకాలంలో హోటల్ కి వెళ్తే టిప్ ఇవ్వడం కంపల్సరీ అయింది. ఇవ్వకపోతే అక్కడున్న సిబ్బంది మనను కింద నుండి మీద వరకు విచిత్రంగా చూస్తారు. అందుకే హోటల్ కి వెల్లాము అంటే ఎంతోకొంత టిప్ ఇచ్చేసి రావాల్సి వస్తుంది. ఇక్కడ ఓ వ్యక్తి ఇచ్చిన టిప్ చూసి అక్కడున్న సర్వర్ షాక్కు గురయ్యింది . మరి అంత తక్కువ ఇచ్చాడా అంటారా... తక్కువ కాదండి మరీ ఎక్కువ ఇచ్చేశారు. తాను హోటల్ లో సర్వర్ కి ఇచ్చిన టిప్ ముందు అతను తిన్న బిల్లు కూడా చిన్నబోయేంతలా టిప్ ఇచ్చాడు . నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఇలాంటిది జరిగింది. ఇక భారీ టిప్ ను అందుకున్న సర్వర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇంతకీ అంత భారీ మొత్తంలో టిప్ ఎందుకు ఇచ్చారు అని తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
వివరాల్లోకి వెళితే... ఇండియానాలోని ఇల్లినాయిస్ నగరంలో రెస్టారెంట్ కు డోర్నివాల్బర్గ్ అనే వ్యక్తి ఓ హోటల్ కి వెళ్ళాడు. తను తినాలి అనుకున్న ఆహారాన్ని ఆర్డర్ ఇచ్చాడు. అదే హోటల్లో సర్వర్ గా పనిచేస్తున్న భేదాని అనే మహిళ ఆ వ్యక్తికి ఆహారపదార్థాలు అందించింది. ఇక భోజనం పూర్తయిన తర్వాత ఆ మహిళ అతనికి బిల్లు తెచ్చింది. అయితే అందులో మొత్తం బిల్లు 78 డాలర్లు అని ఉంది. దీంతో టిప్పు తో కలిపి వంద డాలర్లు ఇస్తారేమో అని ఆ మహిళ ఊహించింది. కానీ డోర్నివాల్బర్గ్ తిన్న 78 డాలర్లకు టిప్ గా 2020 డాలర్లు అంటే మన కరెన్సీలో 1.45 లక్షలు రాయడంతో ఆ మహిళా నోటమాట రాలేదు. పొరపాటు పడ్డారు ఏమో అని సర్వర్ మరోసారి ఆ వ్యక్తికి గుర్తు చేసింది.
దీంతో డోర్నివాల్బర్గ్ ఆమెకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ... మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్న అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దీంతో ఆ మహిళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒక్కసారిగా అంత మొత్తంలో టిప్ అందడంతో.. ఆ మహిళకు అసలు సిసలైన నూతన సంవత్సర కానుకగా అందినట్లు అయింది . ఇలాంటి టిప్ ఇప్పిస్తారని తెలిస్తే అందరూ ఆ హోటల్లో పని చేయడానికి వెలతారేమో కదా.