ఆయన పెళ్లాలను మార్చుకోడానికి మాత్రమే పనికొస్తారు..?

praveen

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానిల  నిర్ణయం తర్వాత అమరావతిలో అంత ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. రాజధాని అమరావతి నుంచి మార్చొద్దు అంటూ అమరావతి రైతులందరూ తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రైతులే కాదు రైతు కుటుంబ సభ్యులందరూ రోడ్ల పైకి చేరి నిరసనలు ఆందోళనలు ధర్నాలు నిర్వహిస్తున్నారు. అమరావతి మొత్తం హాట్ హాట్ గా మారిపోయింది. ఇకపోతే అమరావతి రైతులందరికీ విపక్ష పార్టీ అయిన టిడిపి జనసేన పార్టీ లు  మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అమరావతిలో పర్యటించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ప్రస్తుతం అమరావతి పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులను పరామర్శిస్తూ మద్దతు పలుకుతున్నారు. 

 ఈ సందర్భంగా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. అమరావతి రైతులందరూ నిరసనలు తెలపడంతో ఎక్కడా వెనక్కి తగ్గకూడదని పవన్ కళ్యాణ్ సూచించారు. అంతే కాకుండా మూడు రాజధానుల పేర్లు చెప్పి ప్రభుత్వం ప్రజలందరినీ మోసం చేస్తోంది అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాకుండా జిఎన్  రావు ఇచ్చిన కమిటీ ప్రకారం కాకుండా ప్రజలను మోసం చేస్తూ జగన్ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటూ పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. ఇలా చేస్తే 150 సీట్లు గెలిచినా... శూన్యమే అన్నారు. ఇకపోతే తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.  వేషాలు మార్చుకోవడానికి...రంగులు మార్చుకోవటానికి...  చివరికి పెళ్లాలను  మార్చుకోవడానికి పనికి వస్తారు తప్ప.. రాజకీయాలకు మాత్రం పనికి రారు అంటూ ఘాటుగా విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్. 

 ఒక పార్టీ అధినేత అయ్యుండి రెండు చోట్ల పోటీ చేసిన గెలవలేని పిచ్చి తుగ్లక్ ఇప్పుడు మాట్లాడుతున్నాడు. 150 కాదు అవసరమైతే అంతకంటే ఎక్కువ గెలుస్తాం. చంద్రబాబు పాలనలో నాలుగేళ్ల పాటు ఏం చేశారు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ముల్లు గుచ్చుకుంటే పారిపోయే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతి లో రైతులను కలుస్తూ పవన్ తమపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలు అందరూ పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: