అందమైన ఆడదాన్ని చూస్తే బ్రహ్మకైనా రిమ్మ తెగులు పుడుతుందని చెబుతారు. ఆడదాని కోసం రాజ్యాలే కోల్పోయిన వారు చరిత్రలో ఎందరో ఉన్నారు. అందుకే ఇప్పుడు అమ్మాయిలను అస్త్రంగా కూడా వాడుతున్నాయి కొన్ని దేశాలు. అలాంటి వాటిలో మన పక్కలో బల్లెంలాంటి పాకిస్తాన్ కూడా ఉంది. మన దేశ రహస్యాలు తెలుసుకోవడానికి పాకిస్తాన్ అందమైన అమ్మాయిలను మన సైనికులపై ప్రయోగిస్తోంది.
ఇందుకు సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుంటోంది పాకిస్తాన్. ఇందుకు సంబంధించిన వివరాలు కలకలం రేపుతున్నాయి. విశాఖ పట్నానికి చెందిన కొందరు నావికులను పాకిస్తాన్ అమ్మాయిలు బుట్టలో వేసుకుని కొన్ని కీలకమైన సైనిక రహస్యాలు తెలుసుకున్నట్టు మన దేశ నిఘా వర్గాలు గుర్తించాయి. ఆపరేషన్ డాల్ఫిన్ నోస్ పేరుతో జరిగిన ఈ ఆపరేషన్ వివరాలు సంచలనం సృష్టిస్తున్నాయి.
ఈ కేసు కు సంబంధించి ఇటీవల ఏడుగురు నావికాదళ సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని ప్రశ్నిస్తే ఇంకా మరికొన్ని వాస్తవాలు తెలిశాయట. ఈ అమ్మాయిల ద్వారా నావికాదళ సమాచారం మాత్రమే కాదట. దీని ద్వారా హవాలా పద్దతిలో నగదు కూడా పెద్ద ఎత్తున చేతులు మారిందట. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా దొరికాయట. అంతే కాదు.. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇంకొందరు కూడా అరెస్టయ్యే ఛాన్సులున్నాయట.
ఇదంతా పాక్ ఓ పద్దతి ప్రకారం చేస్తోందని ఇండియా నిఘా వర్గాలు చెబుతున్నాయి. పాకిస్తాన్ కు చెందిన ఇంటలిజెన్స్ సంస్థ హస్తం ఉందట. వాళ్లే ప్లాన్ చేసి పాక్ అమ్మాయిల వెనుక ఉండి ఈ తతంగం నడిపిస్తున్నారట. ఫేస్ బుక్, వాట్సప్ లలో అందమైన ప్రొఫైల్ పిక్స్ పెట్టి భారత సైనికులను వలపు వలలోకి లాగుతారు. ఆ తర్వాత మెల్లగా ఒక్కో రహస్యం తెలుసుకుంటారు. ఐఎస్ ఐ కు చేర వేస్తారు. ఇదీ వీళ్ల ప్లాన్. అందుకే ఇప్పుడు కేంద్ర పారామిలటరీ దళాలకు చెందిన జవాన్లు సోషల్ మీడియా వాడకంపై ఆంక్షలు విధించాలని కేంద్రం భావిస్తోందట. అంతే కాదు.. స్మార్ట్ ఫోన్ల వినియోగంపై కూడా ఆంక్షలు విధించే అవకాశం ఉందట.
మరింత సమాచారం తెలుసుకోండి: