క్యాబినెట్ మీటింగ్ తర్వాత చంద్రబాబు తిప్పలు తప్పవా... ఎందుకంటే..?

praveen

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నేడు ఏపీ కేబినెట్ మీటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. మీటింగ్ లో ముఖ్యంగా మూడు రాజధానిల అంశం ప్రధానంగా చర్చకు రానుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా జగన్ ప్రకటించిన మూడు రాజధానిల అంశంపై భిన్న  అభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే వెలగపూడి కార్యాలయంలో జగన్ అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ ప్రారంభమైంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. వెలగపూడి మందడం సహా పలు గ్రామాలను తమ ఆధీనంలోకి తీసుకొని 144 సెక్షన్ విధించి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. రాష్ట్రం మొత్తం జగన్ 3 రాజధానిల ప్రకటన చేసిన నేపథ్యంలో... జిఎన్  రావు ఇచ్చిన కమిటీపై నేడు క్యాబినెట్ మీటింగ్ లో చర్చించి ఏం  నిర్ణయం తీసుకోబోతున్నారు అని ఉత్కంఠగా మారింది. 

 


 అయితే మొదలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదలు మంత్రి వర్గ ఉపసంఘం తో భేటీ అయ్యారు. కాగా  ఈ భేటీలో మంత్రివర్గ ఉప సంఘం ఏసీబీ పురావస్తు అధికారుల నుంచి వివరాలు సేకరించి చంద్రబాబుపై అవినీతి నివేదికను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అందించింది. చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులు రాజధాని నిర్మాణం సహా పలు విషయాలలో ఎలాంటి కుంభకోణాలకు పాల్పడ్డారు అనే అంశాలను ఒక నివేదిక రూపంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అందించింది మంత్రివర్గ ఉప సంఘం. కాగా మంత్రి వర్గ ఉపసంఘం అందించిన నివేదిక పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారు అన్నదానిపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు.

 


 ఈ నేపథ్యంలో చంద్రబాబు  అవినీతి చిట్టా మొత్తం మంత్రివర్గ ఉప సంఘం జగన్ కు నివేదిక అందించడంతో ఇప్పుడు జగన్ ఇలా ముందుకు సాగుతారు  అనేది ఆసక్తికరంగా మారింది. చిన్న ఛాన్స్ వచ్చినా చంద్రబాబును గట్టిగా టార్గెట్ చేస్తున్నారు  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహా వైసీపీ నేతలు.ఇక ఇప్పుడు  అవినీతి చిట్టా తమ చేతికి రావడం తో ఇంకా ఎలాంటి విమర్శలు చేస్తారో  ఎలా స్పందిస్తారు అన్నది అందరిలో నెలకొన్న ప్రశ్న. చంద్రబాబుకి ఇక నుంచి తిప్పలు తప్పవా అని చర్చించుకుంటున్నారు. జగన్ వద్దకు చేరిన అవినీతిని వేదికపై జగన్ ఎలా స్పందిస్తారో  అన్నది మాత్రం ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో  ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: