అమ్మఒడి పథకానికి అర్హులా...? కాదా...? ఇలా తెలుసుకోండి... !

Reddy P Rajasekhar

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు నవరత్నాల్లో భాగంగా అమ్మఒడి హామీని ఇచ్చిన విషయం తెలిసిందే. జగన్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత నవరత్నాలలోని హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. అమ్మఒడి పథకాన్ని సీఎం జగన్ జనవరి 9వ తేదీన అమలు చేయనున్నారు. మొదట జనవరి 26వ తేదీన ఈ పథకాన్ని అమలు చేయాలని జగన్ భావించారు. 
 
కానీ కొన్ని కారణాల వలన అమ్మఒడి పథకం అమలును జనవరి 26 నుండి జనవరి 9వ తేదీకి మార్చారు. 15 వేల రూపాయలు ఈ పథకం ద్వారా అర్హులైన విద్యార్థులందరికీ ప్రభుత్వం అందించనుంది. 6,455 కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రభుత్వం ఈ పథకం కోసం కేటాయించింది. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 75 శాతం హాజరు ఉండి తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్నవారు అమ్మఒడి పథకానికి అర్హులు. 
 
మధ్యలో చదువును నిలిపివేసిన విద్యార్థులు ఆ విద్యా సంవత్సరానికి ఈ పథకానికి అర్హులు కాదు. ఆదాయపు పన్ను చెల్లించేవారు, రిటైర్డ్ అయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు కాదు. అమ్మఒడి పథకానికి అర్హులో కాదో ఆన్ లైన్ లో ఆధార్ కార్డు నంబర్ ను ఎంటర్ చేయడం ద్వారా సులభంగా తెలుస్తుకోవచ్చు. 
 
అర్హులో కాదో తెలుసుకోవాలనుకునేవారు మొదట https://jaganannaammavodi.ap.gov.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. వెబ్ సైట్ ఓపెన్ చేసిన తరువాత అమ్మఒడి చైల్డ్ స్కీం వివరాలు అనే ఆప్షన్ ను ఓపెన్ చేసి అందులో విద్యార్థి తల్లి ఆధార్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తరువాత కాప్చా కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వివరాలను ఎంటర్ చేయటం ద్వారా అమ్మఒడి పథకానికి అర్హులో కాదో తెలుసుకోవచ్చు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: