100కి ఫోన్‌ చేసి పిర్యాదు చేస్తే ఇలా కూడా చేస్తారా...?

Suma Kallamadi

ప్రస్తుత రోజులలో సమాజంలో ఎవరైనా సరే ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటే 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడం చాలా సహజం. కానీ తాజాగా సైబరాబాద్‌ లో  చోటు చేసుకున్న ఘటన చూస్తే చాల వింతగా ఉంది. 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడం వల్ల యువకుడిని పోలీస్ స్టేషన్ కు తీసుకపోవడం జరిగింది ఒక  కానిస్టేబుల్‌. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వీధిలోజరిగిన  గొడవపై డయల్‌ 100కి ఫోన్‌ చేసిన ఓ యువకుడిపై సైబరాబాద్‌ కానిస్టేబుల్‌ దాడికి పాల్పడం జరిగింది.  హైదరాబాద్ లోని జీడిమెట్ల హెచ్‌ఏఎల్‌ కాలనీలో అల్లరిమూక గొడవపై సోమవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఓ యువకుడు  డయల్‌ 100కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో జీడిమెట్ల కానిస్టేబుల్‌ కాటేశ్వరరావు కాలనీకి వచ్చి అల్లరిమూకను గొడవను సద్దు మణికించడం జరిగింది.

 

ఇది అంత బాగానే ఉంది కానీ ఆ తర్వాత డయల్‌ 100కి ఫిర్యాదు చేసిన యువకుడికి ఫోన్‌ చేసి ఇంటిలో  నుంచి బయటకు పిలిచాడు కానిస్టేబుల్‌.  యువకుడితో కానిస్టేబుల్‌ మాట్లాడుతూ... ‘అర్థరాత్రి సమయంలో నా నిద్ర ఎందుకు చెడగొట్టావురా? ఎవరు కొట్టుకుని చస్తే నీకెందుకురా?’  అని అంటూ బూతులు  తిట్టడం జరిగింది. ఇలా చేయడం మాత్రమే కాదు రెండు చెంపలు కూడా కొట్టి, తిడుతూ జీపులో జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొని పోవడం జరిగింది. 

 

ఇంకా కుటుంబసభ్యులతో మాట్లాడడానికి కూడా వీలు లేకుండా యువకుడి ఫోన్‌ను కాసిస్టేబుల్‌ తీసుకున్నాడు. మరోవైపు యువకుడు చాల సమయం నుంచి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు  అరగంటపాటు కాలనీ మొత్తం వెతకడం జరిగింది. చివరికి పోలీస్‌ స్టేషన్‌కు దగ్గరు పోయాక ఆ యువకుడు మీడియా సంస్థ ఉద్యోగి అని తెలుసుకున్న కానిస్టేబుల్‌ తిరిగి ఇంటి వద్ద వదిలి పెట్టి పోయాడు. 

 

ఈ ఘటనపై కుటుంసభ్యులు డీజీపీతో పాటు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేయడం జరిగింది. డయల్‌ 100కి ఫోన్‌ చేస్తే.. ఇంటి నుంచి తీసుకెళ్లి మరీ ఎలా కొడతారు అని  కుటుంసభ్యులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. సంబంధిత కానిస్టేబుల్‌పై కఠిన చర్యలు కచ్చితంగా  తీసుకుంటామని సైబరాబాద్‌ సీపీ కుటుంసభ్యులుకు  హామీ ఇవ్వడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: