జగన్ పుట్టినరోజునాడే అద్భుత పథకం..ఇకనుంచి వారికి ఏటా 24 వేలు.?

praveen

జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో వినూత్న పథకాలు ప్రవేశ పెడుతూ ముందుకు సాగుతున్నారు. ఎన్నికల ముందు చెప్పిన విధంగానే అవినీతిరహిత పారదర్శక పాలన అందిస్తూ రాష్ట్ర ప్రజల అందరి మన్ననలు పొందుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాజన్న పాలన మరోసారి రాబోతుంది అని నమ్మిన ప్రజలందరికీ అంతకు మించిన పాలనే అందిస్తూ... మాట తప్పని మడమ తిప్పని సీఎంగా ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజాక్షేమం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఎన్నో హామీలను ఆరు నెలల పాలన లోనే నెరవేర్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 

 

 

 

 అయితే నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 47 వ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు. అయితే ఇప్పటికే ఎన్నో సంచలన పథకాలను ప్రవేశపెట్టి... ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలిచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఆయన  పుట్టినరోజునాడు ఓ అద్భుత పథకానికి ఊపిరి పోశారు. రాష్ట్రంలోని చేనేత కార్మికుల కష్టాలను తొలగించేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకు వస్తున్న కొత్త పథకమే వైయస్సార్ నేతన్న నేస్తం. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అనంతపురం జిల్లా ధర్మవరంలో పర్యటించనున్న ఏపీ సీఎం జగన్ వైఎస్ఆర్ నేతన్న నేస్తం  పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. 

 

 

 

 ఈ సందర్భంగా ధర్మవరంలో భారీ సభను ఏర్పాటు చేశారు. ఇక ఈ సభ పైనే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తన 47వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. వైయస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా చేనేత మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం 24000 అందించనుంది. అయితే అనంతపురం జిల్లాలో నేత మగ్గం కార్మికులు 27,481 మంది ఎంపికయ్యారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 81,783 మంది  నేత మగ్గం  కార్మికులంతా ఈ పథకం నుంచి లబ్ధి పొందనున్నారు. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం 196.27 కోట్లు ఖర్చు చేయబడుతుంది. అయితే ఒక్కో మగ్గానికి 24000 ఆర్థిక సాయం చేస్తామని గతంలో ప్రజా సంకల్ప యాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: