మూడు రాజధానిలో కాన్సెప్ట్ బాగుంది.. కానీ.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు.?
గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని మార్పు రగడ రగులుతూనే ఉంది. ఈ క్రమంలో రాజధాని మార్పుపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం రాజధాని మార్పు విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని మార్పు అంశంపై అసెంబ్లీ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని... దక్షిణాఫ్రికా దేశాలకు మూడు రాజధానిలు ఉన్నాయని... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా 3 రాజధానిలు వచ్చే అవకాశం ఉంది అంటూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఆంధ్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
ఈ క్రమంలోనే విశాఖపట్నం లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్... అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్.. కర్నూలులో జ్యుడీషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జగన్ మూడు రాజధానిలో ప్రకటనలపై వైసిపి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానిలో కాన్సెప్ట్ బాగుందని.. హైకోర్టు నిర్మాణం విషయంలో చిన్న మార్పు చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగానే శాసన వ్యవహారాలకు ప్రస్తుత రాజధాని అమరావతిని పరిపాలనా వ్యవహారాలకు విశాఖపట్టణం బాగుంటాయని తెలిపిన రఘురామకృష్ణరాజు... హైకోర్టుకు మాత్రం కర్నూల్ లో కాకుండా విజయవాడలో ఉంటే బాగుంటుందని తన అభిప్రాయం వ్యక్తం చేసారూ . భౌగోళికంగా చూసుకుంటే సౌతాఫ్రికాలో సుప్రీంకోర్టు దేశానికి మధ్యలో ఉంటుందని ఈ క్రమంలోనే ఏపీ హైకోర్టు కూడా రాష్ట్రంలో మధ్యలో ఉండే విజయవాడలోనే ఉంటే బాగుంటుంది అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
హైకోర్టు నిర్మాణం రాష్ట్రంలోని మధ్యలో ఉండే విజయవాడలో జరిగితే రాష్ట్ర ప్రజలందరికీ న్యాయవ్యవస్థ అందుబాటులో ఉంటుందని ఎంపీ రఘురామకృష్ణంరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా కర్నూలులో రెండు బెంచ్ లు ఏర్పాటు చేస్తే సరిపోతుందని రాయలసీమ లాయర్లు కూడా ప్రభుత్వాన్ని అదే కోరారని.. కర్నూలు ప్రజలు కూడా బహుశా ఇదే కొరుకుని ఉంటారు అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓ టీవీ ఛానల్ కి హాజరవ్వగా లైవ్ డిస్కషన్ లో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం ఎంపీ రఘురామకృష్ణం రాజు చేసినా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కాగా గతంలో కూడా ఆయన జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.