ఏపీ రాజధాని మార్పు పై విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. అమరావతి పై ఆయన నిర్ణయం తీసుకుంటారు.?
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జగన్ సర్కార్ పై విమర్శలు చేసే ప్రతిపక్ష నేతల పై పార్టీలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ కౌంటర్ ఇస్తూ ఉంటారు. ట్విట్టర్ వేదికగా ప్రతిపక్షాల పై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు విజయసాయిరెడ్డి. ఇకపోతే గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని రగడ రగులుతున్న ఉన్న విషయం తెలిసిందే. రాజధాని మార్పు చేస్తారా చేయరా అనే విషయం అటు ప్రజలు ఇటు రాజకీయ పార్టీ నేతల్లో కూడా స్పష్టత లేకుండా పోయింది. అయితే దీనిపై అసెంబ్లీలో టిడిపి సభ్యులు వైసిపి పార్టీని ప్రశ్నించగా.. రాష్ట్ర రాజధాని మార్పు లేదని... అమరావతినే అభివృద్ధి చేసుకుందాం అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
ఇక ఆ తర్వాత రోజే శాసనమండలిలో మంత్రి బొత్స సత్యనారాయణకు ఇలాంటి ప్రశ్న ఎదురవ్వగా రాజధాని మార్పు విషయంలో మరోసారి యూ టర్న్ తీసుకున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం రాజధాని మార్పు చేయాలా వద్దా అని ప్రభుత్వం నిర్ణయిస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాజధాని మార్పు విషయంలో మరోసారి ప్రశ్న తలెత్తింది. ఇక తాజాగా రాజధాని మార్పు పై వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని మార్పు చేయాలా వద్దా అనే నిర్ణయాన్ని సీఎం జగన్ తీసుకుంటాడు అని విజయసాయి రెడ్డి తెలిపారు.
గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న టిడిపి అధినేత చంద్రబాబునాయడు ఏపీ లో చేసిన అభివృద్ధి శూన్యం అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుంటే అది చూసి చంద్రబాబు ఓర్వలేక పోతున్నారు అని అందుకే అనవసర విమర్శలు చేస్తున్నారని విజయ సాయి రెడ్డి విమర్శించారు. తనకు చాలా అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరోగమనం పట్టించే విధంగా ప్రయత్నాలు జరుపుతున్నారంటూ విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఏపీ రాజధాని మార్పు అంశంపై నిపుణుల కమిటీ ఇచ్చిన సిఫారసు నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి జగన్ తుది నిర్ణయం తీసుకుంటారని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.