
హామీ ఇచ్చినట్లుగా నే వారికి మంత్రి పదవులు.?
కర్ణాటకలో ఎన్నో నాటకీయ పరిణామాల తర్వాత బిజెపి... కాంగ్రెస్ జెడిఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించి... కాంగ్రెస్ జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కర్ణాటక లో బీజేపీ పిలుపు మేరకు కాంగ్రెస్ జెడిఎస్ కు చెందిన 15 మంది ఎమ్మెల్యేలు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు అటు వెంటనే స్పీకర్ వారిపై అనర్హత వేటు కూడా వేసారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ఉప ఎన్నికలు జరిగాయి. అయితే 15 మంది ఎమ్మెల్యేలు తాను చెబితేనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని... వాళ్ళ వల్లే తాను ముఖ్యమంత్రిని అయ్యానని కర్ణాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప వ్యాఖ్యానించారు. తాను చెప్పగానే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన అందరు అభ్యర్థులకు ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంత్రి పదవులు ఇస్తానంటూ కర్ణాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప వ్యాఖ్యానించారు.
కాగా ఈ నెల 5న 15 అసెంబ్లీ స్థానాలకు కర్ణాటక ఉప ఎన్నికలు జరగ్గా... 15 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలలో బిజెపి ముందు నుంచి జోరు చూపిస్తూ అత్యధిక మెజారిటీతో 12 స్థానాలను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో గతంలో రాజీనామా చేసిన అభ్యర్థులందరికీ ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవులు కట్టబెట్టేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీని కోసం త్వరలోనే కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ.. హోంమంత్రి అమిత్ షా ను కలిసి ఈ విషయంపై చర్చించనున్నట్లు సమాచారం.
అనంతరం కర్ణాటకలో మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 5న జరిగిన ఉప ఎన్నికల్లో 12 మంది బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇద్దరు అభ్యర్థులు ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో గెలిచిన 12 మందికి మంత్రి పదవులు కేటాయించినట్లు గానే... ఓడిపోయిన అభ్యర్థులు అయినా ఏహెచ్ విశ్వనాధ్.. ఎంబీటి నాగరాజు లకు కూడా ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవులు కట్టబెట్టేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప నిర్ణయించినట్లు తెలుస్తోంది.