చంద్రబాబు ఆలోచనలు దారుణంగా ఉన్నాయి : ఎమ్మెల్యే మేరుగ నాగార్జున
తాడేపల్లి వైసీపీ కార్యాలయం నుండి వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడుతూ ప్రజలు సీఎం జగన్ కు 151 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి గెలిపించినా ఇతర పార్టీలు ఇప్పటికీ తమ తప్పులను తెలుసుకోవటం లేదని చెప్పారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పనితనానికి కూలి పని పోగొట్టుకున్న కార్మికులు, పేదలు, రైతులు చంద్రబాబుపై కసిగా ఉన్నారని అన్నారు. చంద్రబాబుపై చెప్పులు, కర్రలు వేసిన ఘటన గురించి చెబుతూ టీడీపీ లాంటి పరిపాలన కాదని సంబంధిత అధికారులు వెంటనే సిట్ వేశారని మేరుగ నాగార్జున చెప్పారు.
ఎవరు సంఘటనకు బాధ్యులుగా ఉన్నారో వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని మేరుగ నాగార్జున చెప్పారు. మీ ఆలోచనలు చాలా దారుణంగా ఉన్నాయని చంద్రబాబుని ఉద్దేశించి చెప్పారు. ఇప్పటికీ చంద్రబాబు నాయుడికి పశ్చాత్తాపం లేదని అన్నారు. చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంతంలో రైతులకు, పేదలకు, దళితులకు అన్యాయం చేశారని అన్నారు. చంద్రబాబు రాజధానిని రియల్ ఎస్టేట్ వ్యాపారిలా గ్రాఫిక్స్ లో చూపించి నేషనల్ మీడియాను కూడా మోసం చేశారని మేరుగ నాగార్జున అన్నారు.
చంద్రబాబు పనితనం అందరూ చూస్తున్నారని మేరుగ నాగార్జున అన్నారు. చంద్రబాబు దళితులు, పేదల భూములు లాక్కున్నారని చెప్పారు. చంద్రబాబు దేనిమీద అఖిలపక్ష సమావేశం పెట్టాలనుకుంటున్నారని మేరుగ నాగార్జున ప్రశ్నించారు. ముందేమో నూజివీడు, విజయవాడ, గుంటూరు, నాగార్జున యూనివర్సిటీ రాజధాని అని చంద్రబాబు చెప్పారని రాజధాని ప్రాంతంలో రైతుల, పేదల భూములను తీసుకొని మోసం చేసిన నువ్వా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టేది అని మేరుగ నాగార్జున ప్రశ్నించారు.
ఓటుకు నోటు కేసులో దొరికితే దాని గురించి మాత్రం చంద్రబాబు మాట్లాడరని అన్నారు. అంబేద్కర్ ను కూడా చంద్రబాబును మోసం చేశారని మేరుగ నాగార్జున అన్నారు. కొన్ని రోజుల క్రితం రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పర్యటన చేసిన విషయం తెలిసిందే. తమకు అన్యాయం చేశారని కొంతమంది రైతులు గో బ్యాక్ అన్ని నినాదాలు చేయగా కొందరు రైతులు చంద్రబాబుపై రాళ్లు, కర్రలు విసిరారు. చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ఘాటుగా స్పందించారు.