మద్యపాన నిషేదాన్ని అమలు చేయాలి : నేరేళ్ల శారదా
రాష్ట్రంలో మద్యపాన నిషేదాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు నేరేళ్ల శారద డిమాండ్ చేయడం జరిగింది. మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి, దేశంలో మద్యం అమ్మకాలలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని శారదా విమర్శించడం జరిగింది. మంగళవారం పటాన్ చేరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో పీసీసీ మహిళా అధ్యక్షురాలు నేరేళ్ల శారదా నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రదర్శన, ధర్నా కూడా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా మూడు డిమాండ్లతో మహిళలు ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మద్యం విచ్చలవిడిగా పెరగడంతోనే నేరాల సంఖ్య బాగా పెరుగుతుందని శారదా అన్నారు. తెలంగాణలో నేరాలను అదుపు చేసే యంత్రాంగం పూర్తిగా విఫలం అయ్యిందని, కేంద్ర నేరాల నమోదు వివరాల ప్రకారం దేశంలో నేరాలలో రెండో స్థానంలో తెలంగాణ ఉంది అని శారదా విమర్శించడం జరిగింది.
ఇక రాష్ట్రంలో సాంకేతిక రంగం మార్పులలో భాగంగా నీలి చిత్రాల ప్రసారాలు చాలా ఎక్కువ అయ్యాయి అని దాంతో యువత తప్పుదోవ పత్తిపోతున్నారని వాటిని నియంత్రించే అవకాశాలు లేకపోవడంతో వాటి వల్ల నేరాలు, అత్యాచారాలు ఫలితంగా పెరుగుతున్నాయని విమర్శించడం జరిగింది.
వాటిని పూర్తిగా నియంత్రించాలని అని శారదా డిమాండ్ చేయడం జరిగింది. అలాగే తాజాగా జరిగిన దిశ అత్యాచారం, హత్య కేసులో ఒక ప్రత్యేక కమిటీ వేయాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి దోషులకు నెల రోజులలో కఠిన శిక్షలు అమలు అయ్యేలా చూడాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్దఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టడం జరిగింది. శారదా మాట్లాడుతూ ఆడపిల్లలకు రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకోవాలని కోరడం జరిగింది.