ప్రియాంక చివరి మాటలు ఫోన్ లో...!
ప్రియాంక చివరిసారిగా తన చెల్లెలు భవ్యతో మాట్లాడింది. బైక్ టైర్ పంచర్ అయ్యిందనీ, లారీ వాళ్లు ఇక్కడ ఉన్నారంటూ తన చెల్లితో చెప్పింది. వాళ్ల వాలకం చూస్తుంటే భయమేస్తుందన్న ప్రియాంకకు భయపడినంతా జరిగింది. ఇంతకీ చెల్లెలితో ప్రియాంక ఫోన్‌లో ఏం మాట్లాడిందో ఓ సారి చూద్దాం. .
ప్రియాంక: అక్కడ బైక్ పెట్టి పోతానని చెప్పినా కదా.. అయితే ఈ రోజు చెట్టుకింద నిలబడ్డా... టోల్ కలెక్ట్ చేసే ఆయన వచ్చి ఇక్కడ బైక్ పెట్టకండి మేడమ్.. ఇంతకు ముందే పోలీస్ వాళ్లు వచ్చి తీసుకుపోయిండంటే... అయితే తిరిగి ఔటర్ రింగ్ రోడ్డుకు ఇంకో రోడ్ ఉంటాది కదా..! అక్కడ పెట్టాను. కొంచెం దిగి వచ్చాను ఇక్కడికి. స్కూటీ పంక్చర్ అయ్యింది. ఇక్కడ వదిలేస్తా.. ఇంకేంటి.
సోదరి : వదిలేస్తే.. పొద్దున ఇంకెవరు తీసుకొస్తారే?
ప్రియాంక: ఇంక పొద్దున అంటే.. ఇంకెవరినైనా తీసుకెళ్లి తీసుకురావాలి.
సోదరి: ఎవరిని తీసుకెళ్లాలి.
ప్రియాంక : కొంచెం దూరం వెళ్లగానే పంక్చర్ అయ్యింది.
సోదరి: చూడది.. కొంచెం దూరం వస్తుందేమో?
ప్రియాంక: వెనుకాల టైర్ పంక్చర్ అయ్యింది. ఇక్కడొక లారీ ఉందే.. అందులో జనాలున్నారు. అందులో ఒకాయన నేను చేపించి తీసుకొస్తానని స్కూటీ తీసుకెళ్లాడు.
సోదరి: తీసుకురాలేదా మళ్లీ.?
ప్రియాంక: తీసుకొచ్చిండు. షాపు క్లోజ్ ఉందని తీసుకొచ్చిండు. మళ్లీ.. ఇంకో షాపు ఉందని అంటున్నాడు. నాకు భయమేస్తుంది. స్కూటీ మళ్లీ తీసుకుపోయిండు.
సోదరి : మళ్లీ తీసుకురాలేదా ఇంకా?
ప్రియాంక : ఇప్పుడే పోయిండు. భయమేస్తుంది నాకు.
సోదరి : ఎవ్వరూ లేరా అక్కడ?
ప్రియాంక : వెహికిల్స్ ఉన్నాయి.. టోల్ వసూలు చేస్తారుగా అక్కడ. నేను వెళ్తా అంటే.. వద్దు అంటున్నాడు. మధ్యలో ఆగిపోతుంది అంటున్నాడు. నాకు భయమేస్తోంది.
సోదరి : ఎందుకు ఏమైతది. టోల్ గేట్ దగ్గరే ఉండు.
ప్రియాంక : వాళ్లు బయటే నిలబడ్డారు.
సోదరి : ఎవరు?
ప్రియాంక : లారీ వాళ్లు
సోదరి : టోల్ గేట్ ఉంటాది కదా. అక్కడికి వెళ్లి నిలబడు
ప్రియాంక : అక్కడికా.. మాట్లాడు పాప.. నాకు భయమేస్తోంది.
సోదరి : ఏం ఫర్వాలేదు... టోల్ ప్లాజా దగ్గర టికెట్లు ఇస్తారు కదా.. టోల్ బూత్ ఉందా? అక్కడికెళ్లి నిలబడు.
ప్రియాంక: వీళ్లేంటే... సడెన్‌గా ఎవ్వరూ కనిపించడం లేదు?
ప్రియాంక: ఏడుపొస్తుందే...!
సోదరి : అంత లేటుగా వెళ్లడం అవసరమా?
ప్రియాంక: నాకు అస్సలు ఇక్కడ నిలబడాలనే లేదు.
సోదరి: వెళ్లూ... ఆ టోల్ బూత్ దగ్గరకు వెళ్లి నిలబడు
ప్రియాంక: అక్కడ నిలబడితే అందరూ చూస్తుంటారు...
వచ్చేటోళ్లు... పోయేటోళ్లు.!
సోదరి: చూడనీ
ప్రియాంక: కొంచెం సేపు మాట్లాడు పాపా.. బైక్ వచ్చే వరకూ..టెన్షన్‌గా ఉంది.
సోదరి: అంతంతె సేపు మాట్లాడితే ఏమనుకుంటారు వాళ్లు.
ప్రియాంక: ఐదు నిమిషాలు ఎలా... నేను ఒక్కదాన్నే రోడ్డు మీద ఉంటే.. దెయ్యంపిల్లా నువ్వు.!
సోదరి: ఇంత రాత్రి పూట పోవడం అవసరమా మరి!
ప్రియాంక : పని అయిపోయింది
సోదరి : అంత ఇంపార్టెంటా... రేపు పోకూడదా?
ప్రియాంక : రేపు మళ్లా మీటింగ్ ఉందని చెప్పిండ్రు మాకు.! సండేనో.. మండేనో టెంపుల్‌కు తీసుకుపోతున్నారు.
అస్సలు కుదురుతూనే కుదరడం లేదు. వాళ్లను చూస్తుంటే.. నాకు చాలా భయంగా ఉందే..! ఈ దెయ్యం పిల్లగాడు ఇంకా రాలేదు.
సోదరి : సరే.. కొంచెం సేపు అయిన తర్వాత చేస్తా మరి!
ప్రియాంక : లేదు.. పాప!
సోదరి : ఐదునిమిషాలైనాక ఫోన్ చేస్తా!