తెలంగాణ ఆర్టీసిలో వీఆర్ఎస్..?

Suma Kallamadi

తెలంగాణ సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణలో ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసి కార్మికులు 52 రోజులు సమ్మె చేసి విరమించడం జరిగింది. కానీ సర్కార్ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాలేదు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసి కార్మికులు ఆందోళనలో ఉన్నారు. 

 

 

ఆర్టీసిలో 5100 రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో వీటిని ప్రైవేటీకరణ చేసేందుకు సర్కార్ సిద్దమవుతుందని సమాచారం. ప్రస్తుతం ఆర్టీసికి 10,400 బస్సులు ఉన్నాయి. దాదాపు 48 వేల మంది ఉద్యోగులు పనిలోకి రావడం జరిగింది. ప్రస్తుతం ఆర్టీసిని ప్రైవేటీకరణ చేస్తే ప్రభుత్వం బస్సులు 50 శాతం, ప్రైవేటు బస్సులు 50 శాతం నడిచే అవకాశం ఉంది. 

 

 

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న అందరి ఉద్యోగుల అవసరం ఉండదు. అందుకే దాదాపు 20 వేల మంది ఉద్యోగులను వీఆర్ఎస్ తీసుకోవాలని సర్కార్ కోరనున్నట్టు తెలుస్తోంది. 50 ఏండ్లకు పైబడిన వారందరిని వీఆర్ఎస్ ద్వారా సర్కార్ ఇంటికి సాగనం పాలని చూస్తున్నట్టు సమాచారం కూడా వినిపిస్తుంది. అయితే దీనికి ఎట్టి పరిస్థితుల్లోను ఉద్యోగులు ఒప్పుకునే అవకాాశం అసలు లేదు.

 

 

ఒకవేళ ఉద్యోగులకు తమ సర్వీసు అంతా పూర్తి అంతా పూర్తి చేసుకుంటే పొందే ప్రయోజనాలు ఇస్తే ఉద్యోగులు ఏమైనా ఆలోచన చేసే అవకాశం ఉంది. అంతే కానీ ఇష్టారీతిన పొమ్మంటే ఉద్యోగులు మాత్రం వెళ్లే అవకాశం లేదు. మరో వైపు బలవంతంగా సర్కార్ వీఆర్ఎస్ ఇచ్చి పంపేందుకు కూడా అధికారం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. గురు, శుక్రవారాల్లో జరిగే కేబినేట్ భేటీల్లో దీని పై ఒక క్లారిటి వస్తుంది అని వార్తలు వినిపిస్తుంది. మొత్తానికి తెలంగాణ ఆర్టీసిలో  వీఆర్ఎస్ కలకలంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: