
మరోసారి నెటిజన్లకు దొరికిపోయిన నారాలోకేష్... జగన్ను విమర్శిస్తూ.?
టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు మాజీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలపై ఎన్నోసార్లు నెటిజన్లు ట్రోల్స్ చేశారన్న విషయం తెలిసిందే. నారా లోకేష్ చేసే వ్యాఖ్యలు అప్పుడప్పుడు తప్పులు దొర్లుతుంటాయి. దీంతో నెటిజన్లు ఆ వ్యాఖ్యలను తెగ ట్రోల్స్ చేస్తూ ఉంటారు. అయితే నారా లోకేష్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. అధికార పార్టీ నేతల పై సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఎప్పటికప్పుడు ఆరోపణలు చేస్తూ విమర్శలు గుప్పిస్తూ ఉంటారు నారా లోకేష్.ఇదిలా ఉంటే ఎక్కువశాతం నారా లోకేష్ చేసే ట్విట్ లు నెటిజన్లకు ట్రోల్స్ కి కారణమవుతాయి. ఇప్పటికే ఎన్నోసార్లు నెటిజన్లు ఆయన ట్విట్ లు పోస్టులపై ఎన్నో సార్లు ట్రోల్స్ చేసారు కూడా . అయితే ఇప్పుడు మరోసారి తన ట్విట్ తో నెటిజన్లకు దొరికిపోయాడు నారా లోకేష్.
దేశం మొత్తంలో ఉల్లి దిగుబడి తగ్గి ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్న విషయం తెలిసిందే. భారీగా పెరిగిన ఉల్లి ధరలతో దేశం మొత్తంగా అన్ని రాష్ట్రాలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పలు రాష్ట్రాలలో తక్కువ ధరకే ఉల్లిని అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనే రైతు బజార్లలో రాష్ట్ర ప్రజలందరికీ 25 రూపాయలకే కిలో ఉల్లిపాయలు అందుబాటులో ఉంచేందుకు నిర్ణయించారు. అయితే దీనిపై నారా లోకేష్ జగన్ పై విమర్శలు చేస్తూ ట్వీట్ చేసి నెటిజన్లకు దొరికిపోయారు.
జగన్ ప్రభుత్వాన్ని విమర్శించే పనిలో ఏపీలో ఉల్లిపాయల ధరలు పెరగడానికి కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ మాజీమంత్రి టీడీపీ నేత నారా లోకేష్ ట్వీట్ చేశారు. ప్రభుత్వ ఏర్పాటు చేసిన ఉల్లి విక్రయ కేంద్రాల్లో రేషన్ కార్డు ఉంటే కానీ ఇవ్వం, ఆధార్ కార్డు ఉంటే కానీ ఉల్లి ఇవ్వం అంటూ అడ్డమైన రూల్స్ పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. దీంతో నారా లోకేష్ ని మరోసారి నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలు పెట్టారు . దేశవ్యాప్తంగా ఉల్లిధరలు దిగుబడి తగ్గి ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతుంటే ... ఏపీలో ఉల్లి ధరలు పెరగడానికి ముఖ్యమంత్రి జగన్ కారణం ఎలా అవుతాడు అంటూ ట్రోల్స్ ప్రారంభించారు.