
ఈరోజు తేలిపోనుందా... రాష్ట్రమంతా తీవ్ర ఉత్కంఠ.?
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల భవితవ్యం ఏమిటో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులందరినీ విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామని జేఏసీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రకటన చేసి రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం జేఏసీ ప్రకటనపై స్పందించలేదు... ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలనే అంశంపై నిర్ణయం తీసుకోలేదు. అయితే ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమణ ప్రకటించిన అనంతరం ఓసారి అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులను విధుల్లోకి తీసుకుని అంశంపై మాత్రం ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల్లో రోజు రోజుకు ఆందోళన ఎక్కువ అవుతుంది. సమ్మె విరమించిన అప్పటికి ప్రభుత్వం తమను విధుల్లోకి తీసుకోకపోవడంపై ప్రభుత్వం స్పందించకపోవడంతో తమ ఉద్యోగాలు ఉంటాయా ఉడతాయా అనే ప్రశ్నార్ధక జీవితం గడుపుతున్నారు ఆర్టీసీ కార్మికులు.
అయితే నేడు మరోసారి సీఎం కేసీఆర్ ఆర్టీసీపై ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించి బోతుండడంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆర్టీసీ కార్మికుల భవితవ్యంపై కీలక నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఆర్టీసీలోని 5,100 రూట్లను ప్రైవేటీకరించడంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కూడా సమర్థించటంతో... ఆర్టీసీ ప్రైవేటీకరణ కు సంబంధించి కూడా ఈ సమీక్షలో చర్చించి విధి విధానాలను కూడా ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే 5,100 రూట్లలో ఆర్టీసీ ప్రైవేటీకరణ పై సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నట్లు సమాచారం.కాగా అటు ఆర్టీసీ కార్మికుల భవితవ్యంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నది అనే అంశం కూడా ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారింది.
అయితే ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలంటూ ఆర్టీసీ జేసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. కానీ అటు ప్రభుత్వం మాత్రం కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి అంటే కచ్చితంగా కార్మికులకు కొన్ని షరతులు విధించాలనే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగబోయే ఉన్నతాధికారుల సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే దానిపై మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ కార్మికులకు షరతులు విధించాలని ప్రభుత్వం భావిస్తే... ఎలాంటి షరతులు కార్మికుల ముందు ఉంచుతుంది... ఆ షరతులపై ఆర్టీసీ జేఏసీ నేతలు ఎలా స్పందిస్తారు అన్నదానిపై కూడా ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.