ప్రక్షాళన దిశగా ఏపీపీఎస్సీ
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రక్షాళన దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయడం మొదలు పెట్టింది. ప్రజాస్వామ్య పద్ధతుల్లో అందరి అభిప్రాయాల సేకరణ కోసం శ్రీకారం చుట్టింది. విద్యార్థులు, నిరుద్యోగులు, మేధావులు, ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోవడానికి సోమవారం విజయవాడలో ప్రత్యేక సమావేశం కూడా జరగబోతుంది.
ఇక వివాదాలను పరిష్కరించి, నిరుద్యోగులలో విశ్వాసం నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది అని అందరికి తెలుస్తుంది. టీడీపీ హయాంలో ఏపీపీఎస్సీ చుట్టూ వివాదాలు ముసురుకున్న విషయం అందరికి తెలిసిందే కదా. కమిషన్ నిర్ణయాలపై గతంలో నిరుద్యోగులు తీవ్రస్థాయిలో ఆందోళనలు కూడా చేయడం జరిగింది.
పలు అడ్డగోలు నిబంధనలు, పరీక్షల నిర్వహణలో, ప్రశ్నపత్రాల తయారీలో తప్పిదాలు నిరుద్యోగులకు నష్టం కలిగించాయి. వీటిపై ఎన్నిసార్లు మొత్తుకున్నా కమిషన్ పాలకవర్గం అసలు వాటిని పట్టించుకోలేదు. పైగా తమను ప్రశ్నించే వారిపై కేసులు పెట్టించడంతో పాటు ఇంటర్వ్యూల్లో వారిని బ్లాక్‌లిస్టుల్లో పెట్టి భయభ్రాంతులకు గురిచేసింది. దీంతో నిరుద్యోగులు తమ సమస్యలను ఎన్నికలకు ముందు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వెల్లడించారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషన్ వ్యవహారాలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష జరిపి, నియామకాలన్నీ పారదర్శకంగా నిర్వహించేలా పలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. గ్రూప్1 పోస్టులు, మరికొన్ని ప్రత్యేక కేటగిరీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు మినహాయించి తక్కిన అన్ని కేటగిరీల పోస్టులకు ఇంటర్వ్యూలను రద్దు చేయడం జరిగింది. క్యాలెండర్ ప్రకారం నియామకాలకు ఏటా జనవరిలో కమిషన్ ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీలో నిరుద్యోగులకు ఇబ్బందికరంగా ఉన్న పలు అంశాలను సరిచేసేలా ఇటీవల కమిషన్ కార్యదర్శి పి.సీతారామాంజనేయులు ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు అందించడం జరిగింది. ఇంటర్వ్యూలకు చైర్మన్ ఆధ్వర్యంలో ఒకే ఒక్క బోర్డు ఉండగా దాన్ని విభజించి మూడు బోర్డులుగా చేయడం జరిగింది.
ఇక గత ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేసింది. అవి ఏంటో చూద్దామా మరి.. టీడీపీ ప్రభుత్వ హయాంలో కమిషన్ అస్తవ్యస్త నిర్ణయాలతో పలు నోటిఫికేషన్లు న్యాయవివాదాల్లో ఉన్నాయి. గ్రూప్1 మినహా ఇతర పోస్టుల భర్తీకి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించలేదు. కానీ ప్రిలిమ్స్‌ను కమిషన్ అన్నిటికీ అమలు చేయడం జరిగింది.
ఇక ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో ఎంపిక విధానాన్ని రద్దుచేసి 1:15కు కుదించడంతో నిరుద్యోగులు బాగా నష్ట పోవడం కూడా జరిగింది. కొత్త ప్రభుత్వం దీన్ని మార్పు చేసి 1:50కి మార్పు చేసింది. గ్రూప్1, గ్రూప్2 సిలబస్‌ను 2016–17లో మార్చడం జరిగింది.