అజిత్ పవార్ కు భారీ షాక్...

praveen

మహారాష్ట్ర రాజకీయాల్లో  బిజెపి శివసేన కూటమి విబేదించడంతో మహా ప్రతిష్టంభన ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత మూడు పార్టీలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఆహ్వానించినప్పటికీ  మూడు పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడంతో రాష్ట్రపతి పాలనకు ఆమోదముద్ర వేసింది కేంద్రం . అయితే ఎలాగైనా మహారాష్ట్రలో తమ ప్రభుత్వం ఏర్పాటు చేసి తమ పార్టీ నాయకుడిని  సీఎం పదవిలో కూర్చోబెట్టాలని శివసేన పార్టీ తీవ్ర కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే బిజెపి పార్టీతో పొత్తు విభేదించినప్పటినుంచి కాంగ్రెస్-ఎన్సీపీ పార్టీలతో చర్చల మీద చర్చలు జరుపుతోంది శివసేన పార్టీ. అయితే ఈ చర్చలు ఓ కొలిక్కి కూడా వచ్చాయి. శివసేన పార్టీ నాయకుడికి సీఎం పదవి మిగతా రెండు పార్టీలకు డిప్యూటీ సీఎం పదవులు స్వీకరించి ఈ మూడు పార్టీల కూటమితో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని శివసేన భావించింది. మహా రాష్ట్ర రాజకీయాల్లో శివసేన నాయకుడు తర్వాతి మహారాష్ట్ర సీఎం అని అందరూ అనుకున్నారు. కానీ బిజెపి రాత్రికి రాత్రి మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలు అన్నింటిని మార్చి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరం చేశారు. ఎన్సీపీ ఎల్పీ నేత అజిత్ పవార్ మద్దతుతో  దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 

 


 అయితే బిజెపి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ మహారాష్ట్రలో కొత్త ట్విస్ట్ లు  తెరమీదికి వస్తూనే ఉన్నాయి. బీజేపీకి మద్దతు తెలపాలనే  అజిత్ పవార్ నిర్ణయాన్ని వ్యతిరేకించినా ఎన్సీపీ  పార్టీ అధినేత శరద్ పవార్... ఎన్సీపీ  పార్టీ బీజేపీకి మద్దతు తెలిపలేదని స్పష్టం చేసారు.  బిజెపికి మద్దతు తెలపాలని నిర్ణయం అజిత్ పవార్ సొంత నిర్ణయం అంటూ తెలిపారు . అంతేకాకుండా అజిత్ పవార్ ను  ఎన్సీపీ ఎల్పీ నేతగా తొలగిస్తున్నట్లు ప్రకటించే  అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం ఎన్సీపి ఎల్పీ సమావేశం జరగనుంది. ఇదిల ఉండగా ఎన్సీపీ శాసనసభపక్ష నేత అజిత్ పవార్ వెంట వెళ్లిన ఎమ్మెల్యేల్లో కొందరు అజిత్ వరకు షాకిచ్చారు. ముగ్గురు ఎమ్మెల్యేలు తిరిగి ఎన్సీపీ  అధినేత శరద్ పవార్ వద్దకు చేరుకున్నారు. ఏదో పని ఉంది అంటేనే తాము  రాజ్ భవన్ కి వెల్లామని అక్కడికి వెళ్ళాక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరుగుతుందని దీంతో తాము  ఎన్సీపీ అధినేత శరత్ పవార్  దగ్గరికి చేరుకున్నమంటూ  ఎమ్మెల్యేలు తెలిపారు. 

 


 రాజ్ భవన్ కు వెళ్లి తిరిగి వచ్చేసిన  ఎమ్మెల్యే రాజేంద్ర షింగానే  మీడియాతో మాట్లాడారు. ఫోన్ చేసి కేవలం ఓ విషయం పై చర్చించాలని అజిత్ పవార్  పిలిచారని ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉందని చెప్పలేదని అక్కడికి వెళ్ళాక ప్రమాణస్వీకారం జరుగుతుండడంతో వెంటనే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ దగ్గరకు వెళ్లి పోయాను అంటూ ఆయన తెలిపారు. అయితే తాను శరత్ పవార్ కు  మద్దతుగానే ఉంటాను అంటూ స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకారం జరుగుతుందన్న విషయం తమకు తెలియదని లేకపోతే అక్కడికి వెళ్లేవాళ్లం కాదని తెలిపారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం బీజేపీకి మద్దతు ఇచ్చిన  అజిత్ పవార్ వెంట కేవలం పది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నట్లు మహా రాజకీయాల్లో చర్చ నడుస్తుంది. అయితే దీనిపై గవర్నర్ ను ఎన్సీపీ అధినేత శరత్ పవార్  వెళ్లి కలవనున్నట్లు సమాచారం. బల నిరూపణ చేసుకునేందుకు బిజెపి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ నెల  30 వరకు అవకాశం ఉండగా... అప్పుడు వరకు మహా రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: