సీఎం జగన్ కు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల షాక్... ఉద్యమ బాటలో ఉద్యోగులు.. ?

Reddy P Rajasekhar

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు సీఎం జగన్ కు షాక్ ఇవ్వబోతున్నారా...? అనే ప్రశ్నకు అవుననే సమధానం వినిపిస్తుంది. సెప్టెంబర్ 30వ తేదీతో ముగిసిన పీఆర్సీ గడువును ప్రభుత్వం రెండు నెలలు పొడిగించింది. నవంబర్ 30వ తేదీ తరువాత పీఆర్సీ గడువును పొడిగించకూడదని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. 
 
11వ పీఆర్సీలో 55 శాతం ఫిట్ మెంట్ తో కొత్త స్కేల్స్ అమలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు. ఉద్యమ బాట పట్టి డిమాండ్లు సాధించుకోవాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి (ఏపీజేఏసీ) నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే పీఆర్సీ అమలు చేస్తానని జగన్ చెప్పారని ఉద్యోగుల సమస్యలపై ఏపీజేఏసీతో చర్చించి పరిష్కరించాలని కర్నూలు జిల్లా ఎస్‌టీయూ అధ్యక్షుడు తిమ్మన్న కోరారు. 
 
కర్నూలు ఏపీజేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ డబ్బుతో పని లేని సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించటం లేదని దశల వారీగా ఉద్యమానికి శ్రీకారం చుట్టామని పలు రకాలుగా ఆందోళనలు చేపట్టబోతున్నామని తెలిపారు. జేఏసీ పెండిగులో ఉన్న మూడు డీఏలను వెంటనే విడుదల చేయాలని, మహిళా ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ లీవ్ లు ఐదు ఇవ్వాలని, ఏపీపీఎస్సీ నిర్వహించే ఉద్యోగోన్నత పరీక్షల్లో నెగిటివ్ మార్కులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 
 
సీపీఎస్ ను రద్దు చేయాలని, నాలుగో తరగతి ఉద్యోగుల వయస్సు 62 ఏళ్లకు పెంచాలని, పెండింగ్ లో ఉన్నజీతాలు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వెంటనే 
చెల్లించాలని, ఎస్‌ఎస్‌డీఎల్‌లోని 10,000 కోట్ల రూపాయలు వెనక్కు రప్పించాలని, జీవో 103ని రద్దు చేయాలని, ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను సర్వీస్ కమిషన్ ద్వారా రెగ్యులర్ సర్వీసుగా భర్తీ చేయాలని మొదలైన డిమాండ్లను కోరుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 29వ తేదీన తహశీల్దార్ కార్యాలయాల ముందు ధర్నా, డిసెంబర్ 10వ తేదీన జిల్లా స్థాయిలో కలెక్టరేట్ ల ముందు ధర్నా, డిసెంబర్ 20వ తేదీన రాష్ట్ర స్థాయిలో విజయవాడలో ధర్నా చేయబోతున్నారని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: