నగరవాసులకు మెట్రో నరకం!
ట్రాఫిక్ సమస్యలు తగ్గించడానికి మెట్రోని ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం . ఎంతో ప్రతిష్టాత్మకంగా మెట్రో నిర్మాణాన్ని చేపట్టి... నగర వాసులందరికీ మెరుగైన రైలు ప్రయాణ సేవలు అందించాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది . దీనికి తగ్గట్టుగానే వేల కోట్లు వెచ్చించి హైదరాబాద్లో మెట్రో నిర్మాణం చేపట్టింది. అంతేకాకుండా మెట్రో ను లాంఛనంగా ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. మెట్రో రాకతో ఉద్యోగులు ప్రయాణికులకు ప్రయాణం సులభమైంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా గత కొన్ని రోజుల నుండి మెట్రో ఎందుకొ కాస్త తేడా కొడుతుంది. మెట్రోలో ప్రయాణం ఎలాంటి పొల్యూషన్ లేకుండా ట్రాఫిక్ లేకుండా ప్రయాణం అంతా సజావుగానే ఉన్నప్పటికీ... రోజురోజుకు మెట్రోలో మాత్రం రక్షణ కరువవుతుంది . అంతేకాకుండా మెట్రోల్లో వివిధ సమస్యలు తలెత్తుతున్నాయి.
మొన్నటి వరకు భాగ్యనగరంలో వర్షాలు ఎక్కువ కురవడంతో మెట్రో పెచ్చులూడి పడి ఓ మహిళకు గాయాలైన విషయం తెలిసింది . అంతేకాకుండా ఈ మధ్య ఎక్కువగా మెట్రోల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ప్రయాణికులకు మైట్రో ప్రయాణం కూడా కష్టంగా మారిపోతుంది . అసలు మెట్రోలో ఎప్పుడు ఏ సమస్య వస్తుందోనని ప్రయాణికులు కూడా జంకుతున్నారు. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా ఫ్లెక్సీలు తెగిపడి పలుమార్లు సర్వీసులకు అంతరాయం కలిగిన విషయం కూడా తెలిసిందే. ప్రజలందరూ ట్రాఫిక్ నుంచి తప్పించి హాయిగా ప్రయాణించేందుకు తెలంగాణ ప్రభుత్వం పెట్రోలు ప్రవేశపెట్టినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల దృశ్య మెట్రో ప్రయాణం నగరవాసులకు నరకప్రాయంగా మారుతుంది.
మెట్రో లో ఎక్కువగా సాంకేతిక లోపాలు వస్తుండడంతో రోజురోజుకు మెట్రో రైలు ప్రయాణం లో అంతరాయం ఏర్పడుతుంది. అంతేకాకుండా సిగ్నల్ సమస్యలు వస్తున్నాయి.నేడు ఎల్బీ నగర్ మియాపూర్ మార్గంలో నడిచి మెట్రోకు అంతరాయం ఏర్పడింది . దీంతో మెట్రోను ప్రజలందరూ నమ్మలేకపోతున్నారు. మెట్రోల్లో రోజురోజుకు రక్షణ కరువవడంతో పాటూ ఎప్పుడు ఎలాంటి సాంకేతిక లోపం మెట్రో ఆగిపోతుందేమో అని అనుకుంటున్నారు . రోడ్డుమీద ప్రయాణిస్తుంటే ట్రాఫిక్ కష్టాలు ఉన్నాయని మెట్రో ఎక్కితే... ఇప్పుడు మెట్రోలో కూడా కష్టాలు ఉంటే పరిస్థితి ఏంటని అనుకుంటున్నారు . ఇక ఇప్పుడు తాజాగా తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతుండడంతో బస్సులుతిరిగే సంఖ్య కూడా తగ్గువగా ఉండటం తో ఎక్కువమంది నగరవాసులు మెట్రో ని ఆశ్రయిస్తున్నారు ఇలాంటి సమయాల్లో సాంకేతిక లోపాలు వచ్చే మెట్రో రైలుకు అంతరాయం ఏర్పడడంతో ప్రయాణికులు కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు.