అవినాష్‌ను గద్దె వర్గం టార్చ‌ర్ పెట్టిందా... !

VUYYURU SUBHASH
తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ పార్టీ మారడానికి కారణం ఏంటి...? ఈ ప్రశ్నకు సమాధానాలు, కర్ణుడి చావుకి కారణాలు దాదాపుగా ఒకటే అంటున్నారు విజయవాడ నేతలు. నెహ్రు ఉన్నప్పుడు లేని కష్టాలు అన్నీ ఆయన పోయిన తర్వాతే అవినాష్ కి వచ్చాయని వారు అంటున్నారు. ఇటీవల చంద్రబాబు తూర్పు నియోజకవర్గ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో దేవినేని వర్గానికి చెందిన కొందరు నాయకులు, బయటకు వచ్చి గద్దె వర్గం మాకు అన్యాయం చేస్తుంది, వారి కారణంగా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం,కనీసం మమ్మల్ని మనుషుల్లా కూడా గుర్తించడం లేదు, చిన్న చిన్న పదవులు కూడా తీసుకోలేకపోతున్నాం, పదవులు అన్నీ వాళ్ళే తీసుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి పార్టీకి సేవ చేస్తున్నాం... మాకు ఎందుకు ఈ పరిస్థితి అనగానే చంద్రబాబు జోక్యం చేసుకుని, ఇక నుంచి నియోజకవర్గం విషయంలో నేను జోక్యం చేసుకుంటాను, ఏ సమస్య ఉన్నా నాకు నేరుగా చెప్పవచ్చని హామీ ఇచ్చారు. 


ఆ తర్వాత దేవినేని వర్గంపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. అది పక్కన పెడితే గద్దె నుంచి అవినాష్ కి ఎప్పటి నుంచో ఇబ్బందులు ఉన్నాయి. వాస్తవానికి అవినాష్ గుడివాడ సీటు తనకు ఇవ్వకముందు పెనమలూరు లేదా, తూర్పు నియోజకవర్గాల్లో ఒకటి ఇవ్వాలని కోరగా చంద్రబాబు అందుకు నిరాకరించారు. అక్కడి నుంచి నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా సరే అవినాష్ వర్గాన్ని గద్దె వర్గం పిలవలేదు. 


పటమట హైస్కూల్ రోడ్డులో తోపుడు బళ్ళు ఇస్తే... సోషల్ మీడియాలో అవినాష్ ఉన్న ఫోటోలు రాకుండా గద్దె వర్గం జాగ్రత్త పడింది. ఇక అవినాష్ కూడా నా ఇల్లు ఉంది తూర్పులో తనకు సీటు కూడా ఇక్కడే ఇవ్వాలని కోరినా ఫలితం లేకపోయింది... ఇక అక్కడి నుంచి అవినాష్ కి ఇబ్బందులు మొదలయ్యాయని అందుకే ఆయన పార్టీ మారిపోయారని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: