విజయా రెడ్డి అంతిమ యాత్ర

Suma Kallamadi
తహశీల్దార్‌ విజయా రెడ్డి దారుణ హత్యను తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఖండించింది. పట్టపగలే ఒక మహిళా ఉద్యోగిని క్రూరంగా హత్య చేయడం అత్యంత హేయమైన చర్య అని వారు పేర్కొన్నారు. ఉద్యోగులకు పూర్తి రక్షణ కల్పించాలని కోరారు. దోషులు ఎంతటివారైనా వదలొద్దని కోరారు. మహిళా ఎమ్మార్వోను సజీవ దహనం చేసిన ఘటనతో తెలంగాణ భగ్గుమంది. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. ఎమ్మార్వో హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు.


 అబ్దుల్లాపూర్‌మెట్‌కు భారీగా చేరుకున్న ఉద్యోగులు రహదారిపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. తహశీల్దార్‌ విజయా రెడ్డి దారుణ హత్యను తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఖండించింది.


 విజయా రెడ్డి అంతిమ యాత్ర కొనసాగింది. అంతిమయాత్రలో ప్రజలు, రెవిన్యూ అధికారులు భారీగా పాల్గొన్నారు. విజయా రెడ్డి మృతదేహానికి రెవిన్యూ సిబ్బంది నివాళులు అర్పించారు. దిల్ సుఖ్ నగర్ లోని ఆమె నివాసము నుంచి నాగోల్ వరకు అంతిమయాత్ర కొనసాగుతుంది. నాగోల్ లోని స్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.


భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కాకుండా బలమైన పౌరసేవల చట్టం తేవడం, సిటిజెన్ చార్టర్ అమలు, అధికారులకు అంతర్గత భద్రతా సెల్స్ లాంటివి ఏర్పాటు, అపార్ట్మెంట్ లాంటి భవనాల్లో కాకుండా కాస్త విశాల స్థలంలో ప్రభుత్వ సొంత కార్యాలయాలు నిర్మాణం, ప్రభుత్వ స్వవలకు సంబంధించి సమాచార పౌర సంబంధ శాఖ నుంచి కాల్ సెంటర్ లాంటివి, అలానే దోషులపై కఠిన చర్యలు త్వరగా తీసుకునే వ్యవస్థ లాంటి మొదలగిన మార్పులతో సమాజంలో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. లేదంటే ఇలాంటి ఘటనలు సమాజం పై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: