గోదావరి బోటు వెలికితీత పునః ప్రారంభం..

Durga Writes
సరిగ్గా ఈరోజుకి గోదావరి బోటు ప్రమాదం జరిగి నెల రోజులు అవుతుంది. సెప్టెంబర్ 15న తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు వద్ద సరిగ్గా మధ్యాహ్నం 1గంటకు రాయల్ వసిష్ఠ బోటు ప్రమాదానికి గురయ్యింది. పాపికొండల అందాలను చూద్దామని బయల్దేరిన 77 మంది ప్రమాదానికి గురి కాగా అందులో 26 మంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.         

                                  

అయితే 77 మందిలో 26 మంది సురక్షితులు అవ్వగా మిగిలిన యాభైఒకరు ప్రమాదంలో మృతి చెందారు. అయితే వారిలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 38 మంది వెలికి తీయగా 13 మంది మృతదేహాలు కోసం ఇంకా గాలిస్తూనే ఉన్నారు. అయితే ఇటీవల మూడు రోజుల పాటు నదిలో లంగర్లువేసి బోటును వెలికితీసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేదు.            

                                 

దీంతో మునిగిన బోటును వెలికి తీసేందుకు ప్రయత్నాలు మళ్లీ పునః ప్రారంభమయ్యాయి. నదిలో వరద ఉద్ధృతి తగ్గడంతో కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం బోటును బయటకు తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీంతో బోటు వెలికితీతకు అవసరమైన సామగ్రిని దేవీపట్నం పోలీస్‌స్టేషన్‌ నుంచి సంఘటన స్థలికి తరలించారు. మరో బోటు వెలికితిత ఈసారి అయినా ఫలితం ఉంటుంది ఏమో చూడాలి.        

                                  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: