నీకంటే చిన్నవాడైన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరిణితితో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే నువ్వేందుకు చేయవంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో కోదండరాం అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు పార్టీల, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చే అంశంపై తమ పార్టీ పునరాలోచన చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు.
తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బుధవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో కోదండరాం అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. అనంతరం చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల వింటే నవ్వు వస్తోందని, గతంలో ఆయన చేసిన వాగ్దానాలు మరోసారి గుర్తుచేసుకోవాలని విమర్శించారు. ఆర్టీసీ అనేది ఇప్పుడు పుట్టింది కాదని, నిజాం కాలం నుంచే ఉందన్న సంగతి కేసీఆర్ గుర్తుంచుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. తమ హక్కుల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు పోరాడతుంటే ఎలా సెల్ఫ్ డిస్మిస్ అవుతారంటూ కేసీఆర్ పై చాడ నిప్పులు చెరిగారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పనులను చూసి కేసీఆర్ ఎంతో కొంత నేర్చుకోవాలని సూచించారు. ఆర్టీసీ సమ్మె విరుద్ధమని కేసీఆర్ ఎలా అంటారని ప్రశ్నించారు. నీకంటే చిన్నవాడైన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరిణితితో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే నువ్వేందుకు చేయవంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో సీపీఐ, టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించిన సమయంలో ఆర్టీసీ సమ్మె ప్రకటన రాలేదని చెప్పారు. టీఎంయూ స్వతంత్ర సంఘంగా ఉంటే హర్షిస్తామని అన్నారు.
ఆర్టీసీ కార్మికుల తొలంగిపు ప్రకటనను కేసీఆర్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హుజూర్‌నగర్ మద్దతుపై సీపీఐ పునరాలోచన చేస్తోందని తెలిపారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులు ఒంటరిగా లేరని.. తెలంగాణ మొత్తం వారి వెనుక ఉందని అన్నారు. చాడా వెంకట్‌రెడ్డి హూజూర్‌నగర్‌లో కేసీఆర్‌కు మద్దతు ప్రకటించడం చాలా పెద్ద తప్పని ఆర్టీసీ సమ్మెతో తెలుసుకున్నాడన్నమాట.