ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వైధ్యారోగ్యంపై సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. డాక్టర్ సుజాతరావు నేతృత్వంలో ఓ కమిటిని నియమించిన ఏపీ సీఎం జగన్ వైద్య రంగంలో, ఆరోగ్య శ్రీ పథకంలో తీసుకోవాల్సిన నిర్ణయాలను సూచనలను చేయాలని ఆదేశించింది. ఈ కమిటి దాదాపు గా 100కు పైగా కొత్త నిర్ణయాలను సిఫారసులు చేసింది. ఈ కమిటీ రూపొందించిన రిపోర్టును ఈరోజు సీఎం జగన్‌కు తాడేపల్లిలో అందించారు. సుజాతరావు కమిటీ సిఫారసులను ఆధ్యయం చేసిన సీఎం జగన్ కొన్ని నిర్ణయాలను వెంటనే అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇవి వైద్య చరిత్రలోనే రికార్డుగా నిలిచిపోనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆరోగ్య శ్రీ పథకంలో దాదాపు 2000లకు పైగా వ్యాధులను చేర్చాలని ప్రతిపాదించారు. ఆరోగ్య శ్రీ పథకాన్నిపైలెట్ ప్రాజెక్టుగా పశ్చిమ గోదావరి జిల్లాను ఎంపిక చేసినట్లు ప్రకటించారు. జనవరి 1 నుంచి నూతన ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. ప్రతి వ్యాధికి రూ.1000 వ్యయం దాటిటే అది ఆరోగ్య శ్రీ పథకంలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కమిటీలో ప్రతిపాదించారు.
ఇక ఆపరేషన్ చేయించుకున్నవారికి ఆ వ్యాధి నయం అయ్యెవరకు ఖర్చుల నిమిత్తం నెల నెలకు రూ.5 వేలు సాయంగా ఇవ్వాలని కమిటి సిఫారసు చేసింది. ఇక ప్రభుత్వ వైధ్యులు సొంత క్లీనిక్‌లు నెలకొల్పుకుని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సక్రమంగా విధులు నిర్వహించడం లేదని, తద్వార ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదని కమిటీ రిపోర్టులో పేర్కోంది.
దీనికి తోడు ప్రభుత్వ వైధ్యులకు సరిపడ వేతనాలు ఇవ్వడం లేదని అందుకే వారు సొంత క్లినిక్‌ల వైపు దృష్టి మళ్ళిస్తూ ప్రజావైద్యాన్ని పట్టించుకోవడం లేదని సూచించడంతో వెంటనే సీఎం జగన్ ఇక ముందు ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు వైద్యం చేయకూడదని, వైద్యులకు సరిపడా వేతనాలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. కిడ్నీ వ్యాధి గ్రస్తులకు, ధీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు నెలకు రూ.5 వేల సాయం చేయాలని ఆధికారులను సీఎం జగన్ ఆదేశించారు.