ఇటీవల కాలంలో దేశంలో దొంగతనాలు ఎక్కువైపోయాయి. పోలీస్ వ్యవస్థను ఎంతటి పటిష్టం చేసినా దొంగతనాలు మాత్రం తగ్గడం లేదు. ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే దొంగతనాలు ఎక్కువైపోయాయి. చిన్న చిన్న పిల్లలు సైతం దొంగతనాలకు పాల్పడుతున్నారు. కారణం ఆకలి కావొచ్చు. వారు పెరుగుతున్న సమయం కావొచ్చు. చుట్టుపక్కల ఉన్న స్నేహితులు కారణం కావొచ్చు.
కారణం ఏదైనా సరే... దొంగతనాలు మాత్రం పెరిగిపోతున్నాయి. ఉద్యోగాల కొరత కూడా దీనికి ఓ కారణంగా మారింది. ఇదిలా ఉంటె అమెరికాలోని ఉత్తర క్యాలిఫోర్నియాలో చికో స్టేట్ యూనివర్శిటీలో చదువుతున్న 21 ఏళ్ల ఓ యువతికి నివసిస్తున్న ఇంటికి జక్వానే అనే 19 ఏళ్ల దొంగ వచ్చాడు. దొంగ దేనికోసం వస్తాడు. కావాల్సిన వస్తువులను దొంగతనం చేయడానికి వస్తాడు. వచ్చాడు.. ఇంట్లో వస్తువులు సర్దేశాడు.
అప్పటికి ఆ అమ్మాయి నిద్రపోతూనే ఉన్నది. అలికిడి చేయకుండా సర్దుకున్న దొంగకు పాపం నిద్రవచ్చినట్టుంది. వెంటనే బట్టలన్నీ విప్పేసి.. ఆ అమ్మాయి పక్కనే పడుకొని నిద్రపోయాడు. సడెన్ గా మధ్యలో ఆ అమ్మాయికి మెలుకువ వచ్చింది. పక్కన చూస్తే దొంగ.. పైగా బట్టలు లేవు. నగ్నంగా పడుకొని ఉన్నాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫోన్ చేసింది. దొంగతనాలను అరికట్టడానికి అమెరికా ప్రభుత్వం కఠినమైన చట్టాలను అమలు చేస్తున్న ఈ సంఖ్య మాత్రం తగ్గడం లేదు.
అది గమనించిన సదరు దొంగ అక్కడి నుంచి ఉడాయించాడు. పోలీసులు వచ్చే సరికి దొంగ లేడు. ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ తో వెంటనే సెర్చ్ ప్రారంభించారు. సిసి కెమెరాల సహాయంలో దొంగను పట్టుకున్నారు. తాను దొంగతనం చేయడానికి మాత్రమే ఆ ఇంటికి వెళ్లినట్టు చెప్పాడు. అయితే, అమ్మాయి పక్కన అలా నగ్నంగా ఎందుకు పడుకున్నావని అంటే చెప్పలేకపోయారు. దీంతో దొంగను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.