కన్నీళ్లే కాంగ్రెస్ కొంప ముంచాయి: లగడపాటి

 హైదరాబాద్: జగన్ అరెస్టు, వైఎస్ విజయమ్మ కన్నళ్లే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొంపను ముంచాయనీ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. అయితే, ఈ ఫలితాలను పాలపొంగుతో పోల్చారు. గతంలో టీఆర్ఎస్కు కూడా ఇలాంటి ఫలితాలు వచ్చాయనీ, తరువాత మారిందన్నారు. గత నెల 25కు ముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగుందన్నారు. జగన్ను సీబీఐ అరెస్టు చేయడంతో ఎన్నికల ప్రచార బాధ్యతలను విజయమ్మ, షర్మిల తీసుకున్న తరువాత చాలా మార్పులు చేసుకున్నాయన్నారు. విజయమ్మ పెట్టుకున్న కన్నీళ్లకు ప్రజల్లో సానుభూతి వచ్చిందన్నారు. గత మూడు నెలల కిందట కొవూరులో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి ప్రసన్నకుమార్ రెడ్డికి వచ్చిన ఓట్లకు ఇప్పడు రాజమోహన్ రెడ్డికి వచ్చిన ఓట్లలో 17శాతం అధికంగా వచ్చాయన్నారు. కేవలం విజయమ్మ ప్రచారంతోనే వైఎస్ఆర్ పార్టీ గెలిచిందన్నారు. కాంగ్రెస్ పార్టీ పథకాలను వైఎస్ఆర్ పథకాలుగా చెప్పుకున్నారనీ అన్నారు. ఈ ఫలితాలు తాత్కాలికమేననీ, భవిష్యత్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతుందనీ, టీడీపీ పరిస్థితి వేరే చెప్పనక్కర్లేదనీ, ప్రత్యేక వాదాలకు ఓట్లు రావనీ పరకాల ఓటర్లు చెప్పారనీ రాజగోపాల్ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: