చంద్రబాబు ఆరోపణల వెనుక కారణం తెలుసా ?
ఇసుక అక్రమరవాణా అంటూ
కొద్ది రోజులుగా చంద్రబాబునాయుడు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. పైగా ఆరోపణల
మోతాదును పెంచుతున్నారు. ఇసుక సరఫరాను ప్రభుత్వం నిలిపేసిందని ఒకవైపు మండిపడుతూన్నారు.
అదే సమయంలో వైసిపి నేతలు ఇసుక అక్రమ రవాణా
వ్యాపారం చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. అంటే రెండు పరస్పర విరుద్ధమైన ఆరోపణలను
చంద్రబాబే చేస్తున్నారు.
చంద్రబాబు హఠాత్తుగా ఆరోపణల మోతాదు పెంచటానికి కారణం ఏమిటి ? ఏమిటంటే గురువారం నాడు ఇసుక విధానంపై జగన్మోహన్ రెడ్డి తన విధానాన్ని ప్రకటించనున్నారు. బుధవారం నాటి క్యాబినెట్ సమావేశంలో ఈ విషయమై ఓ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ విధానం బయటకు వచ్చి గురువారం నుండి జనాలకు ఇసుక తక్కువ ధరలకే దొరుకుతుంటే ఈ విషయమై మాట్లాడేందుకు చంద్రబాబు అండ్ కో కు ఏమి ఉండదు.
నిజానికి చంద్రబాబు హయాంలో చాలామంది టిడిపి నేతలు ఇసుక అక్రమవ్యాపారం ద్వారా కోట్ల రూపాయలు సంపాదించారనే ఆరోపణలున్నాయి. మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలతో పాటు మండలస్ధాయిలో గట్టి పట్టున్న నేతలకు ఇసుక అక్రమ వ్యాపారం ఓ కల్ప వృక్షంలాగ మారిపోయింది. పేరుకు ఉచితమే అయినా ఆకాశమే హద్దుగా టిడిపి నేతలు ఇసుక ద్వారా జనాల దగ్గర నుండి కోట్ల రూపాయలు పిండుకున్నారు.
టిడిపి ప్రభుత్వం మీద జనాల్లో వ్యతిరేకత పెరిగిపోవటానికి ఇసుక అక్రమవ్యాపారం కూడా ఒకటన్న విషయం అందరికీ తెలిసిందే. అటువంటి వ్యాపారంపై జగన్ అధికారంలోకి రాగానే బ్యాన్ పెట్టేశారు. ప్రత్యామ్నాయం చూపకుండా ఇసుకపై బ్యాన్ పెట్టటంతో జనాలు ఇబ్బంది పడుతున్నది వాస్తవం.
ఇంత కీలకమైన ఇసుకను తక్కువ ధరలకే జనాలకు అందించటానికి జగన్ నిర్ణయించారు. ఇసుక టన్ను ధర ఎంతుండాలి ? జనాలకు ఏ రేటుకు ఇవ్వాలి ? అనే విషయం ఈరోజు తేలిపోతుంది. గురువారం నుండి దాదాపు 100 రీచుల నుండి జనాలకు ఇసుకను అందించటానికి అధికారులు రంగం రెడీ చేశారు. తక్కువ ధరలకే ఇసుక జనాలకు అందితే తన ఆరోపణలకు ఇక విలువండదని చంద్రబాబుకు తెలుసు. అందుకే వీలైనంతగా జగన్ ప్రభుత్వంపై బురద చల్లటానికి ప్రయత్నిస్తున్నారు.