టిడిపి ఎంఎల్ఏలకు జగన్ షాక్

Vijaya

తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏల వరకూ జగన్మోహన్ రెడ్డి పెద్ద షాకే ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత టిడిపి ఎంఎల్ఏల్లో చాలామంది వైసిపి వైపు చూశారు. గెలిచిన 23 మంది ఎంఎల్ఏల్లో కనీసం 15 మంది అధికార పార్టీలో చేరటానికి ఆసక్తి చూపించారు. ఇక జనసేన తరపున గెలిచిన ఏకైక ఎంఎల్ఏ కూడా పార్టీ మారిపోయేందుకు రెడీ అయిపోయారు.

 

కానీ జగన్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. నిజానికి పార్టీ ఫిరాయింపులకు చంద్రబాబు లాగే జగన్ కూడా ఓకే చెప్పుంటే ఈ పాటికి చంద్రబాబునాయుడు పరిస్దితి చాలా ఘోరంగా ఉండేదే. కానీ జగన్ ఆ పనిచేయలేదు. పైగా పార్టీ ఫిరాయించే వాళ్ళపై వెంటనే అనర్హత వేటు వేయమని స్పీకర్ తమ్మినేని సీతారామ్ కు స్పష్టంగా అసెంబ్లీలోనే చెప్పేశారు.

 

అనర్హత వేటుపై జగన్ ఎప్పుడైతే బహిరంగంగా చెప్పేశారో అప్పుడే టిడిపి ఎంఎల్ఏలకు షాక్ కొట్టినట్లైంది. అంటే టిడిపి ఎంఎల్ఏలను వైసిపిలో చేర్చుకునే ఉద్దేశ్యం లేదని అందరికీ అర్ధమైపోయింది. అదే సమయంలో అక్కడక్కడ కొందరు టిడిపి నేతలను మాత్రం చేర్చుకుంటున్నారు.

 

కడప జిల్లా కమలాపురం మాజీ ఎంఎల్ఏ వీరశివారెడ్డి పార్టీలో చేరారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో వరుపుల రాజా, అనకాపల్లి ఎంపి అభ్యర్ధి అడారి ఆనంద్ కూడా వైసిపిలో చేరుతున్నారు. వీళ్ళు కాకుండా టిడిపికి చెందిన సుమారు అరడజను మంది నేతలు వైసిపిలో చేరారు. అంటే ఎంఎల్ఏలు చేరటానికి నో చెబుతున్న జగన్ నేతలను చేర్చుకునే విషయంలో మాత్రం జాగ్రత్తగా చూసి ఓకే చేస్తున్నారు. అదికూడా వస్తామని చెబుతున్న అందరి నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం లేదు. జిల్లా మంత్రి, నియోజకవర్గం ఎంఎల్ఏ లేకపోతే  స్ధానిక నేతలు అంగీకరించిన తర్వాత మాత్రమే టిడిపి నేతల చేరికలకు జగన్ ఓకే చెబుతున్నారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: