జగన్.. 3 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్‌ను సర్వనాశనం చేసేశారా..?
మూడు నెలలు తిరగకుండానే ఏపీ సర్వనాశనం అయిపోయిందట.. ఆర్థిక మాంద్యం వచ్చేసిందట.. అభివృద్ధి అంతా ఆగిపోయిందట.. జగన్ పాలన ప్రభావంతో ఇప్పటికే ఏపీకి అన్ని సూచికల్లోనూ వెనుకబడిపోయిందట.. ఇదీ తాజాగా తెలుగుదేశం నాయకులు చేస్తున్న ప్రచారం.. ఇక ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తాజాగా మరింత ఘాటుగా జగన్ సర్కారు తీరుపై విమర్శలు చేశారు.
ఆయన ఏమన్నారంటే.. ఏపి సర్వనాశనం ముఖ్యమంత్రి జగన్ విధ్వంసక స్వప్నం.. ఏపికి చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా ఇమేజ్ పెంచారు... చంద్రబాబు తెచ్చిన ఇమేజికి డేమేజి చేయడమే జగన్ డ్రీమ్. రాకూడని ఆర్ధిక అవలక్షణాలన్నీ రాష్ట్రానికి వచ్చేశాయంటున్నారు. వైసిపి నేరాల చరిత్ర చూసి పెట్టుబడులు రావని.. బెదిరింపులతో పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని యనమల విమర్శించారు.
వ్యవసాయం, పరిశ్రమలు,ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఉపాధి అన్నిరంగాలకు జగన్ తూట్లు పొడుస్తున్నారట. పోలవరం, అమరావతి ప్రాజెక్టులు ఏపికి వెన్నెముకలు.. 3నెలల్లోనే పోలవరం, అమరావతి ప్రాజెక్టుల వెన్ను విరిచేశారట. ఎన్నికల్లో టిఆర్ ఎస్ నుంచి మేళ్లు పొందినందుకే... జగన్ వారికి ప్రత్యుపకారంగా ఏపీలో వైసిపి మాంద్యం సృష్టిస్తోందట.
అమరావతిలో ఎకానమి దెబ్బతీసి, హైదరాబాద్ లో ఎకానమి పెంచడమే సీఎం జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారట. టిఆర్ ఎస్ రుణం తీర్చుకోడానికి ఏపి అభివృద్ధికి గండికొట్టడం హేయం అంటున్నారు యనమల. జగన్ రివర్స్ రూలింగ్ దుష్ఫలితమే ఏపిలో ప్రస్తుత ఆర్ధిక మాంద్యం..సీఎం జగన్ ఆదేశాలతోనే రాజధానిపై బొత్స వ్యాఖ్యలు చేశారట.
అమరావతి అభివృద్దిని తలకిందులు చేశారు... సొంత ఎకానమి పెంచుకోడంపైనే జగన్ దృష్టి అంతా..రాష్ట్ర ఎకానమికి తూట్లు పొడుస్తున్నారంటూ యనమల తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. కానీ టీడీపీ మూడు నెలల్లోనే ఇలా విరుచుకుపడితే ఆ తర్వాత విమర్శించడానికి ఏమీ ఉండదేమో.. ఇలాంటి విమర్శలతో టీడీపీకి ఏమాత్రం మేలు జరుగుతుందో ఆలోచించుకుంటే బెటర్..