నిండుకుంల ధవళేశ్వరం

PHANEENDRA J
ఆంధ్రప్రదేశ్ లో అఅల్పపిడన ప్రభవానికి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ర్టంలోని వాగులు వంకలు పొంగి పోర్లుతున్నాయి. ఇప్పటికే ధవళేశ్వరంలోని కాటన్‌ బ్యారేజి వద్ద గోదావరి వరద ఉధృతి ఆదివారం స్వల్పంగా పెరిగింది. ఒకటి రెండు రోజుల్లో కాటన్‌ బ్యారేజి వద్ద నీటి ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. వర్షాలు కురుస్తుండటంతో ఉభయ గోదావరి జిల్లాల్లోని డెల్టాలకు నీటి విడుదలను తగ్గించారు. ఆదివారం రాత్రి బ్యారేజి వద్ద గోదావరి నీటిమట్టం 10.70 అడుగులుగా నమోదైంది. బ్యారేజి నుంచి 69,003 క్యూసెక్కుల జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. సోమవారం నాటికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని హెడ్‌వర్క్స్‌ ఈఈ ఆర్‌.మోహనరావు తెలిపారు.

ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని, వరదలను ఎదుర్కొనేందుకు ఇరిగేషన్‌ యంత్రాంగం సన్నద్ధంగా ఉందని చెప్పారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 2.73 మీటర్లు, భద్రాచలంలో 16.50 అడుగులు, కూనవరంలో 7.32 మీటర్లు, పోలవరంలో 6.15 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 13.88 మీటర్ల మేర గోదావరిలో నీటిమట్టాలు కొనసాగుతున్నాయి.

జలకళ నిండుకున్న రిజర్వాయర్లు
నీరులేక వెలవెల బోయిన జోలాపుట్, బలిమెల, సీలేరు, డొంకరాయి రిజర్వాయర్లు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలకళ సంతరించుకున్నాయి. వర్షాల కారణంగా వీటిలోకి భారీగా ప్రవాహ జలాలు వచ్చి చేరుతుండటంతో జెన్‌కో అధికారులు అప్రమత్తమయ్యారు. తూర్పుగోదావరి జిల్లా డొంకరాయి రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1,037 అడుగులు కాగా.. ఈ వర్షాలతో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

జెన్‌కో అధికారులు అప్రమత్తమై శనివారం అర్ధరాత్రి రెండు గేట్లు ఎత్తి 4,400 క్యూసెక్కుల నీటిని నేరుగా శబరి నదిలోకి విడుదల చేస్తున్నారు. అక్కడి జల విద్యుత్‌ కేంద్రంలోని ఏవీపీ డ్యాం పూర్తిగా నిండిపోవడంతో మరో రెండు గేట్లు ఎత్తి 4 వేల క్యూసెక్కుల నీటిని మోతుగూడెం రిజర్వాయర్‌లోకి పంపిస్తున్నారు.  మోతుగూడెం జల విద్యుత్‌ కేంద్రంలోని రెండు యూనిట్లలో 210 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: