జగన్ తీసుకున్న ఈ నిర్ణయం.. దేశానికే దిక్సూచి..!?
అవినీతి.. ప్రస్తుతం ప్రజలను పట్టిపీడిస్తున్న సమస్య.. నిత్యం ప్రజల దైనందిన జీవితాల్లో అవినీతి వారిని జీవితాలను నరకప్రాయం చేస్తుంటే.. అధికార వర్గాల్లో ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్న అవినీతి రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను అతలాకుతలం చేస్తోంది. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేసేందుకు జగన్ సర్కారు చేస్తున్న ప్రయత్నం జ్యుడిషియల్ కమిషన్ నిమామకం.
బహుశా..ఇలాంటి ప్రయత్నం దేశంలో ఎక్కడా జరిగి ఉండలేదేమో. అందుకే దేశ చరిత్రలోనే పారదర్శకత ఏపీ నుంచి మొదలవుతోందని జగన్ నమ్మకంగా చెబుతుతన్నారు. గత పాలనలో ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తోందని.. అవినీతిని నిర్మూలించి పారదర్శకత తీసుకురావాలనేదే జ్యూడిషియల్ కమిషన్ ఉద్దేశం అని జగన్ అసెంబ్లీలో చెప్పారు.రూ.100 కోట్లు దాటే ఏ టెండరైనా న్యాయ పరిశీలనకు పంపుతామని.. జడ్జి కోరిన నిపుణులను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమేనని ఆయన ప్రకటించారు.
ఇంకా జగన్ ఏమన్నారంటే...
"గత ఐదేళ్ల చంద్రబాబు పాలన గమనిస్తే..మనం కూర్చున్న ఈ బిల్డింగ్ గమనిస్తే స్కామ్ కనిపిస్తుంది. టెంపరరీ బిల్డింగ్ అడుగుకు రూ.10 వేలు కట్టడానికే ఖర్చు అయిన పరిస్థితి చూశాం. ఏదీ తీసుకున్నా కూడా స్కామ్‌లమయమే. ఇలాంటి పరిస్థితి పూర్తిగా మారాలంటే ఈ బిల్లు ఏ రకంగా ఉపయోగపడుతుందన్నది నాకంటే ముందు మాట్లాడిన వారు చెప్పారు.
ఈ బిల్లు ద్వారా ప్రతి టెండర్ రూ.100 కోట్లు, ఆ పైన ఉన్న పనులను ఒక న్యాయమూర్తి వద్దకు పంపిస్తాం. హైకోర్టు చీఫ్‌జస్టీస్ ఈ బిల్లుకు కేటాయించాలని కోరుతాం. నియమించిన జడ్జి ఒక్కసారి బాధ్యతలు తీసుకున్న తరువాత ప్రభుత్వం పిలిచే ఏ టెండర్ అయినా సరే ఆ జడ్జి వద్దకు పంపిస్తాం. ఆ జడ్జి ఆ టెండర్ డాక్యుమెంట్ పబ్లిక్ డొమైన్లో వారం రోజుల పాటు పెడతాం. ఆ టెండర్లలో ఈ క్లాస్ బాగోలేదు..ఇది మార్పు చేయాలని ఎవరైనా సలహా ఇవ్వవచ్చు. జడ్జికే సలహాలు, సూచనలు ఇవ్వవచ్చు. ఆ జడ్జి వద్ద టెక్నికల్‌గా తోడుగా ఉండేందుకు ఎవరైనా పిలుచుకోవచ్చు.”