
బాబు ఇంకా తానే సీఎం అనే భ్రమల్లోనే ఉన్నారా..: జగన్
టీడీపీ నేతల తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా మాట్లాడారు. ఆ తర్వాత ప్రభుత్వం తరపున జగన్ సమాధానం ఇచ్చారు. ఈ సమయంలో కాస్త గందరగోళం జరిగింది. ఆ తర్వార మరోసారి చంద్రబాబు మాట్లాడతానని సభాపతిని కోరారు.
దీంతో జగన్ మండిపడ్డారు. ఎన్నిసార్లు మాట్లాడతారు.. అసలు మీరు ఎవరనుకుంటున్నారు.. అంటూ నిలదీశారు. చంద్రబాబు ఇంకా తాను ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రినే అనుకుంటున్నారని అన్నారు. ఇంకా తాను ఏపీకి సీఎం అనే భ్రమల్లో ఉంటే ఎలా అన్ని ప్రశ్నించారు.
చంద్రబాబు తాను ప్రతిపక్షనేతనన్న విషయం గుర్తుంచుకోవాలని జగన్ హితవు పలికారు. మాట్లాడితే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ మాట్లాడే చంద్రబాబు సభలో నడుచుకోవాల్సిన కనీస మర్యాదలు తెలియవా అంటూ నిలదీశారు.