మహారాష్ర్టలో ఘెర రోడ్డు ప్రమాదం: 30 మందికి పైగా దుర్మరణం: సీఎం దిగ్బ్రాంతి

 హైదరాబాద్: మహారాష్ర్టలో శనివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ముప్పది మందికి పైగా దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి షిర్డీకి బయలు దేరిన కాళేశ్వరీ ట్రావెల్స్కు చెందిన ప్రయివేట్ బస్సులో 50మందితో బయలు దేరింది. అయితే, శనివారం తెల్లవారు జామున మహారాష్ర్టలోని ఉస్మానాబాద్కు వెళ్లగానే లోయలో పడటంతో అక్కడికక్కడే 30మంది మరణించినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడ్డ వారిని సమీపంలోని షోలాపూర్ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాద ఘటన పట్ల మన రాష్ర్ట సీఎం కిరణ్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంపై మహారాష్ర్ట సర్కార్తో మాట్లడటంతో పాటు తగు చర్యలు తీసుకోవాలంటూ రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలను అందుకున్న మెదక్ జిల్లా కలెక్టర్ రోడ్డు ప్రమాదం జరిగిన ఘటనా స్థలానికి ప్రత్యేక టీంను పంపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: