
వారెవా.. వరల్డ్ కప్పుకూ పాకిన జగన్ క్రేజ్..?
ఏపీ సీఎం జగన్ కు యూత్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. దాదాపు తొమ్మిదేళ్లుగా నిత్యం ప్రజల్లో ఉంటూ.. ప్రజల మధ్యనే తిరుగుతూ ఆయన సంపాదించుకున్న క్రేజ్ అది. ఏపీ సీఎం కావాలన్న కోరికను కఠోర శ్రమ ద్వారా ప్రతికూల పరిస్థితుల మధ్య పోరాడి సాధించుకున్న తీరు యువతను ఆకర్షిస్తోంది.
అందుకే జగన్ కు యూత్ లో అంత ఫాలోయింగ్ ఉంది. అయితే ఇప్పుడు ఈ క్రేజ్ ప్రపంచ కప్ కూడా పాకింది.. తాజా ఇంగ్లండ్ లో జరుగుతున్న వరల్డ్ కప్ పోటీల్లో జగన్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ప్రేక్షకుల గ్యాలరీల్లో కూర్చుని ఫ్లెక్సీల ద్వారా తమ అభిమానాన్ని చాటుతున్నారు.
జగన్ ఫ్యాన్స్ క్రేజ్ బౌండరీలు దాటుతోంది. వైఎస్ జగన్ ను ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోల్చుతూ తయారు చేసిన ఫ్లెక్సీ ఆకట్టుకుంటోంది. ఇండియన్ క్రికెట్ కెప్టెన్ కోహ్లీని ఓవైపు... జగన్ ఫోటోను మరోవైపు చిత్రిస్తూ.. జగన్ ను ఇండియన్ పొలిటికల్ కెప్టెన్ గా ఫ్యాన్స్ వర్ణించారు. ఇప్పుడు ఈ పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.