చంద్రబాబుకు ఓదార్పు..! అంతా ఓ డ్రామా..!

Chakravarthi Kalyan

జగన్ ఏపీ సీఎం కాగానే రాష్ట్ర అభివృద్ధి సంగతి పక్కకు పెట్టి కక్షసాధింపు కోసం ప్రయత్నిస్తున్నాడని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజావేదిక కూల్చివేత.. చంద్రబాబు నివాసానికి నోటీసులు అంశాలను వారు ఉదాహరణలుగా చూపుతున్నారు. బాబు హయాంలో జరిగిన స్కామ్‌లు తవ్వితీత వ్యవహారమూ కక్షసాధింపుకోసమే అంటున్నారు.


మరోవైపు చంద్రబాబు నివాసానికి రాజధాని ప్రాంత రైతులు వచ్చి.. ఆయన్ను ఓదార్చినట్టు కథనాలు వచ్చాయి. చంద్రబాబు ఇల్లు కూల్చేస్తే మా ఇల్లు ఇస్తామంటూ వారు చెబుతున్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఇదంతా చంద్రబాబు సానుభూతి కోసం ఆడుతున్న డ్రామా అంటున్నారు వైసీపీ నేతలు.


ఎవరు సలహో ఇచ్చారో కాని తనను ఓదార్చేందుకు రోజుకు 300 మందిని రప్పించుకుంటున్నారు చంద్రబాబు అంటున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. వచ్చిన వాళ్లు బాగా రిహార్సల్ చేసి యాక్షన్ ఇరగదీస్తున్నారని.. దేశంలోనే సంపన్నుడైన రాజకీయ నేతను, ఇల్లు లేకపోతే మా ఇంటి కొచ్చి ఉండండయ్యా అనడం డ్రామా కాకపోతే మరేమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు.


ప్రజావేదిక తొలగింపును వివాదాస్పదం చేసి సానుభూతి పొందాలని చంద్రబాబు గారు ఆయన ముఠా వేసిన ఎత్తుగడ ఎదురు తన్నిందంటున్నారు విజయసాయి. రేకుల షెడ్డుకు 9 కోట్ల ఖర్చెలా అవుతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారని.. రాజధాని వ్యవహారాల్లో ఇంకా ఎంత అవినీతి జరిగిందోనన్న చర్చ మొదలైందని విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: