జ‌గ‌న్‌తో ర‌హ‌స్య భేటీ ఎందుకు... ఎమ్మెల్సీ కోస‌మేనా..!

VUYYURU SUBHASH
ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌. ప్ర‌కాశం జిల్లా చీరాల రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక ముద్ర వేసుకున్న రాజ‌కీయ నాయ‌కుడు. ముఖ్యంగా త‌న‌దైన శైలిలో కామెంట్లు చేయ‌డంలోను, ఎదురు లేని విధంగా ప్ర‌త్య‌ర్థుల‌పైదూకుడు ప్ర‌ద‌ర్శించ‌డంలోనూ ప్ర‌త్యేక‌త‌ను సొంతం చేసుకున్నారు. రాజ‌కీయ భీష్ముడుగా పేరు తెచ్చుకున్న మాజీ గ‌వ‌ర్న‌ర్‌, సీఎం, రోశ‌య్య శిష్యుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఆమంచి.. కాపు వ‌ర్గానికి చెందిన నాయ‌కుడే అయినా.. మాస్ జ‌నాలను ఎక్కువ‌గా త‌న‌వైపు తిప్పు కొన్నారు. గ‌తంలోకాంగ్రెస్ నుంచి ఒక‌సారి పోటీ చేసి విజ‌యం సాధించిన ఆమంచి.. 2014లో కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి చీరాల న‌వోద‌యం పార్టీ టికెట్‌పై పోటీ చేసి గెలుపొందారు. 


ఆ త‌ర్వాత రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల్లో భాగంగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయిన‌ప్ప‌టికీ స్థానిక కేడ‌ర్‌తో అంటీ ముట్టన ట్టుగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీతో విభేదించి మ‌రీ వైసీపీలోకి చేరిపోయారు. వైసీపీ టికెట్‌పై చీరాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సునామీ క్రియేట్ చేసినా చీరాల‌లో మాత్రం ఆమంచి ఘోరంగా ఓడిపోయారు. క‌ర‌ణం బ‌ల‌రాం ఆమంచిపై ఏకంగా 17 వేల ఓట్ల భారీ మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించారు. దీంతో ఇప్పుడు ఆయ‌న భ‌విష్య‌త్తు ఏంటి? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌చ్చింది. ఆయ‌న ఓడిపోయినా.. వైసీపీ అధికారంలోకి రావడంపై ఆమంచి హ్యాపీగానే ఉన్నారు. ఇక‌, ఇప్పుడు వైసీపీకి పెరిగిన ఎమ్మెల్సీ సీట్ల నేప‌థ్యంలో ఆమంచికి ఎమ్మెల్సీ టికెట్ ఖాయ‌మ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. 


ఇదిలా వుంటే, తాజాగా జ‌గ‌న్‌ను ఆయ‌న తాడేప‌ల్లి నివాసంలో ర‌హ‌స్యంగా క‌లుసుకున్నార‌ని స‌మాచారం. రాజ‌కీయంగా త‌న‌కు ఏదైనా ప‌ద‌వి కావాల‌ని జ‌గ‌న్‌ను ఆయ‌న కోరిన‌ట్టు ఆమంచి అనుచ‌ర వ‌ర్గంలో ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనికి జ‌గ‌న్ కూడా ఓకే చెప్పిన‌ట్టు స‌మాచారం. ఒక‌వేళ ఇది రాకున్నా.. పార్టీలో కీల‌క‌మైన ప‌ద‌వి అయినా ఆమంచి ద‌క్కుతుంద‌ని భావిస్తున్న‌ట్టు చెబుతున్నారు. టీడీపీ ప‌త‌నం కావ‌డం, క‌నీసం 30 స్థానాల్లో అయినా జ‌న‌సేన విజ‌యం సాధిస్తుంద‌ని భావించినా కేవ‌లం ఒక్క సీటుతో స‌రిపెట్టుకుంది. ఇక‌, రాజ‌కీయంగా పుంజుకోవాల‌న్నా,  నియోజ‌క‌వ‌ర్గంలో సీనియ‌ర్ నేత బ‌ల‌రాంను త‌ట్టుకోవాల‌న్నా.. ప్రొటోకాల్ కోసం అయినా ఇప్పుడు ఆమంచికి ఎమ్మెల్సీ ఒక్క‌టే ఆప్ష‌న్‌గా ఉంది. 


చీరాల లాంటి కీల‌క నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని తిరుగులేని విధంగా బ‌లోపేతం చేయాల‌న్నా.. ఆమంచి లాంటి కీల‌క లీడ‌ర్ చ‌ట్ట‌స‌భ‌ల్లో ఉండాల‌ని జ‌గ‌న్ భావించినా ఆమంచికి మ‌ళ్లీ ఎమ్మెల్సీ ద‌క్కే ఛాన్సులు ఉన్నాయి. మ‌రి ఆమంచి  విష‌యంలో జ‌గ‌న్ ఫైన‌ల్‌గా ఎలాంటి డెసిష‌న్ తీసుకుంటారో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: