ఎడిటోరియల్ : చంద్రబాబుకు తలనొప్పులు తెస్తున్న ఓదార్పులు ?

Vijaya

తెలుగు రాష్ట్రాల్లో ‘ఓదార్పు’ అన్న పదం జగన్మోహన్ రెడ్డితోనే బాగా పాపులర్ అయ్యింది.  అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ చేసిన ఓదార్పు యాత్ర గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మొన్నటి ఎన్నికల తర్వాత జరుగుతున్న ఓదార్పు మాత్రం వేరేగా ఉంది. తాజా ఓదార్పు మాత్రం చంద్రబాబునాయుడు విషయంలో జరుగుతోంది లేండి.

 

మొన్నటి ఎన్నికల్లో జనాలు తెలుగుదేశంపార్టీకి చాచి చెంప పగలగొట్టినట్లుగా తీర్పిచ్చారు.  మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో వైసిపిని  ఏకంగా 151 స్దానాల్లో గెలిపించారంటే ఏమిటర్ధం ?  వెల్లడైన ఫలితాలు చంద్రబాబునాయుడుకు పెద్ద షాకిచ్చాయి. ఓటమి తప్పదని తెలిసినా మరీ ఇంత ఘోరంగానా అని తెగ బాధపడిపోతున్నారు.

 

అందుకే చంద్రబాబు మనసు తెలిసిన నేతలు చాలామంది వంతుల వారీగా చంద్రబాబును ఓదార్చటానికి రివర్సు ఓదార్పు యాత్రలు చేయిస్తున్నారు. ఏదో టైం టేబుల్ వేసుకున్నట్లుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి జనాలు రావటం చంద్రబాబును పట్టుకుని భోరుమని ఏడ్వటం విచిత్రంగా ఉంది. ఇపుడు ఓదార్పుకు వస్తున్న జనాల్లో చాలామందికి చంద్రబాబుతో అసలు పరిచయం కూడా ఉండే అవకాశం లేదు.

 

టిడిపి సీనియర్ నేతలే పనికట్టుకుని ప్రయాణ సౌకర్యాలు కల్పించి మరీ జనాలను చంద్రబాబు దగ్గరకు తరలిస్తున్నట్లు అర్ధమవుతోంది. 2003లో చంద్రబాబు మీద మావోయిస్టుల దాడి జరిగినపుడు కూడా పరామర్శ పేరుతో టిడిపి సీనియర్ నేతలు ఇదే విధంగా జనాలను భారీగా తరలించారు. అప్పట్లో ఈ విషయం పెద్ద వివాదాస్పదమైంది.

 

ఒకవైపు పుత్రరత్నం లోకేష్ ఓడిపోయాడు. మరో వైపు చరిత్రలో ఎన్నడూ చూడని దారుణ పరాభావం ఎదురైంది. పార్టీ భవిష్యత్తేంటో చంద్రబాబుకే అర్ధం కావటం లేదు. అందుకే టిడిపి నేతలు ఎవరిదారి వాళ్ళు చూసుకుంటున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఈ పరిస్దితుల్లో ఎక్కడెక్కడి నుండో మహిళలు రావటం ఓదార్పు పేరుతో భోరుమని ఏడ్వటాన్ని చంద్రబాబు ఎన్ని రోజులు భరించాలో ?

 

 

 

 

 

 

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: