ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ తర్వాత ఈవీఎంల పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.. రాష్ట్రంలో చేసిన హడావిడితో పాటు ఏకంగా ఆయన జాతీయ స్థాయిలో దీన్నో ఇష్యూగా మార్చారు. 21 పార్టీలను కలుపుకుని వెళ్లి ఈసీపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారు. కానీ అవేవీ సఫలం కాలేదు.
ఇప్పుడు ఇదే అంశంపై ఏపీ కాబోయే సీఎం జగన్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ను ఈవిఎమ్ లకు పట్టిన వైరస్ గా జగన్ కామెంట్ చేశారు. జగన్ ఏమన్నారంటే... చంద్రబాబు తన పరువు కోల్పోయారు. మొదట నియోజకవర్గానికి ఒక వీవీ ప్యాట్ లెక్కించాలి అని ఈసీ చెప్పింది. దీనిపై చంద్రబాబు తదితరులు కోర్టుకు వెళ్లారు. కోర్టు కూడా పారదర్శకత కోసం నియోజకవర్గానికి కనీసం 5 వీవీప్యాట్లు లెక్కించాలని చెప్పింది.
కానీ 50 శాతం వీవీ ప్యాట్లు లెక్కించాలని చంద్రబాబు మళ్లీ అనవసర రాద్ధాంతం చేశారు. అసలు ఈ వ్యవహారానికి చంద్రబాబే ఓ వైరస్‌లా మారి ఈవీఎంలకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేశారు. ఆయన తన ఓటమికి ఓ సాకు వెతకాలని భావించారు. ప్రజలు నన్ను వేరే కారణంతో గెలిపించారని నమ్మించాలనుకున్నారు.
కానీ చివరికి ఏమైంది.. నియోజకవర్గానికి లెక్కించిన 5 వీవీప్యాట్ల స్లిప్పులు ఈవీఎంలలోని ఓట్లతో సరిపోయాయి. అన్నీ సక్రమంగా ఉన్నాయి. చంద్రబాబు దేశ ప్రజలను మోసగించేందుకు ప్రయత్నించారని స్పష్టమైంది. ఆయన దేశాన్ని తప్పుదారి పట్టించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని రుజువైందన్నారు వైఎస్ జగన్.